సూపర్ స్టార్ మహేష్ చాలా ఏళ్ల తరువాత యువ దర్శకుడితో చేసిన 'సరిలేరు నీకెవ్వరు' చిత్రం ప్రపంచవ్యాప్తంగా కొద్ది గంటల క్రితమే తన మొదటి ఆటను విజయవంతంగా ప్రదర్శింపజేసుకుంది. మహేష్ బాబు ఆర్మీ ఆఫీసర్ గా కనిపించిన చిత్రానికి కామెడీ ప్రధాన బలం గా పేరొందిన అనిల్ రావిపూడి దర్శకత్వం వహించాడు. చిత్రంలో మహేష్ మేనరిజం మరియు డైలాగ్ డెలివరీ దూకుడు రోజులను గుర్తు చేస్తుందని సినిమా చూసిన ప్రేక్షకులు అంతా చెబుతున్నారు. ఆర్మీ లోని సీన్ తో మొదలయ్యే సినిమాలో మొదటి భాగం  వరకుకూడా అసలు కధేమిటో బయటపడదు.

 

అయితే అద్భుతమైన ఇంటర్వల్ బ్లాక్ తర్వాత ఇంటర్వెల్ వెంటనే వచ్చే మంచి సీన్ల తర్వాత వెంటనే కథను రివిల్ చేసి ఉంటే బొమ్మ అక్కడే బ్లాక్బస్టర్ అయిపోయేవది. కానీ మొదటి భాగంలో లో ఎక్కువ శాతం కామెడీ తో సాగించిన అనిల్ సెకండ్ హాఫ్ లో కూడా తర్వాత ఇరవై నిమిషాలు కామెడీతో నడిపిస్తూ కథని సాన బెట్టడం అనేది ప్రేక్షకులను బేజారు చేసిందనే చెప్పాలి. ఇక తీరా కథలోకి వచ్చే సమయానికి కి కథని వదిలేసి మళ్ళీ కామెడీతో దూకేస్తూ సూపర్ స్టార్ ఇమేజ్ ను ఆడుకుంటూ సినిమాని ముందుకు నడిపించాడు అనిల్.

 

సినిమా బి,సి సెంటర్లలో పక్కగా ఆడుతుంది కానీ ఏ-సెంటర్లలో ఏదైనా లోటు ఉంది అంటే అది బలమైన కథ అది లేకపోవడమే. ఒక స్టార్ హీరోని డైరెక్ట్ చేసేటప్పుడు మాస్ ఆడియన్స్ కు నచ్చేలాగా కమర్షియల్ ఎలిమెంట్స్ అన్నీ ఉన్నాయా లేదా అని చూసుకోవడమే పనిగా పెట్టుకున్న అనిల్ వాటికి తగ్గట్టు ఒక బలమైన కథను ఎంచుకోవడంలో విఫలమయ్యాడు అనే చెప్పాలి. మొత్తానికి అనిల్ చిత్రంతో పర్వాలేదనిపించినా ఇంతటి వీక్  స్టోరీ పాయింట్ తో ఓవర్ కామెడీ తో లాంగ్ రన్ లో చిత్రం ఎంత కలెక్ట్ చేస్తుందో చెప్పడం కష్టమే.

మరింత సమాచారం తెలుసుకోండి: