సంక్రాంతి కానుకగా మహేష్ అనీల్ రావిపుడి కాంబినేషన్ లో భారీ అంచనాలతో వస్తున్న సినిమా సరిలేరు నీకెవ్వరు. పటాస్ నుండి ఎఫ్-2 వరకు వరుస సక్సెస్ లతో దూసుకెళ్తున్న అనీల్ రావిపుడి సూపర్ స్టార్ మహేష్ తో చేసిన సినిమా ఇది. అయితే కొన్నాళ్లుగా మాస్ ఆడియెన్స్ కు దూరంగా ఉంటూ వస్తున్న మహేష్ కు పర్ఫెక్ట్ మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వచ్చిన సినిమా ఇది. అందుకే ఈ సినిమాపై అంచనాలు తారాస్థాయిలో ఏర్పడ్డాయి.

 

ఈరోజు రిలీజ్ అవుతున్న సరిలేరు నీకెవ్వరు సినిమా ఏపిలో కొన్ని చోట్ల షోలు మొదలయ్యాయి. ఈ సినిమా ట్రైలర్ లో చూపించినట్టుగా అవుట్ అండ్ అవుట్ కామెడీ అండ్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా వస్తుందని తెలుస్తుంది. శ్రీమంతుడు, భరత్ అనే నేను, మహర్షి సినిమాలతో పోల్చితే ఇది ఒక మాములు సినిమా అని చెప్పొచ్చు. పైన చెప్పిన మూడు సినిమాలతో పోల్చితే ఈ సినిమా ఎంత మాత్రం సరితూగదు. ఓ మాములు సాదాసీదా కథకు కామెడీ అద్ది ఈ సినిమా తీశాడు దర్శకుడు అనీల్ రావిపుడి. 

 

సంక్రాంతి సీజన్ కావడంతో కచ్చితంగా కలిసి వచ్చే అంశమే అని చెప్పొచ్చు.. కథ, కథనాలు చాలా సింపుల్ గా అద్దేసి సినిమా చుట్టేశాడు అనీల్ రావిపుడి. జూలైలో సినిమా మొదలై డిసెంబర్ కల్లా పూర్తి చేసి జనవరి రిలీజ్ అన్నప్పుడే అనీల్ ఈ సినిమా ఎంత స్పీడ్ గా చుట్టేశాడన్నది అర్ధమవుతుంది. అయితే సినిమా కథ ఎలా ఉన్నా ఎంటర్టైనింగ్ విషయంలో ఢోఖా లేకుండా చేశాడు. అందుకే సినిమాను ఆడియెన్స్ తప్పకుండా ఎంజాయ్ చేసే అవకాశం ఉంది. రేపు వస్తున్న అల వైకుంఠపురములో సినిమా ఎఫెక్ట్ కచ్చితంగా సరిలేరు నీకెవ్వరు మీద పడుతుంది. సరిలేరు నీకెవ్వరు అనీల్ ఎప్పటిలానే తన కామెడీతో హిట్ కొట్టాలని చూస్తున్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: