తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన తాజా చిత్రం `సరిలేరు నీకెవ్వరు`. స‌క్సెస్‌ఫుల్ డెరెక్డ‌ర్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ సినిమాని సంక్రాంతి పండగకి కానుకగా జనవరి 11 న ప్ర‌పంచ‌వ్య‌ప్తంగా రిలీజ్ కానుంది. ఈ సినిమాలో మహేష్ బాబు ఆర్మీ లుక్ లో కనిపించనున్నాడు. ఇందులో మహేష్ సరసన రష్మిక మందన్నా హీరోయిన్ గా నటించింది. ఇక ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్, టీజర్, ట్రైలర్స్ సినిమాపైన మంచి అంచనాలను పెంచేసాయి. దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సమర్పణలో జీఎంబీ ఎంటర్‌టైన్మెంట్, ఏకే ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్లపై రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మించారు. 

 

ఇక విష‌యానికి వ‌స్తే.. ఆర్మీ మేజర్ గా సూపర్ స్టార్ మహేష్ పవర్ఫుల్ ఎంట్రీ తరువాత వచ్చే యాక్షన్ సీన్, దానితరువాత వచ్చే సాంగ్ తో సినిమా మంచి జోష్ తో సాగుతుంది. అయితే ఫ‌స్టాప్ మొత్తం కామెడీతో నింపేశాడు అనిల్ రావిపూడి. ఫ‌స్టాఫ్‌లో వ‌చ్చే  ట్రైన్ జ‌ర్నీలో మ‌హేశ్ ను ర‌ష్మిక చూడ‌డం ప్రేమ‌లో ప‌డ‌డం త‌న తండ్రి రావు ర‌మేష్‌ చూసిన పెళ్లి న‌చ్చ‌క‌పోవ‌డం. ఇవ‌న్నీ వెంట వెంట‌నే జ‌రిగిపోతాయి. ఇలా ఫ‌స్టాఫ్ ఎన‌భై నిమిసాల‌లో అస‌లు క‌థ‌లోకి సినిమా వెళ్ల‌దు. వాస్త‌వానికి అనిల్ రావిపూడి గ‌త సినిమాల‌తో పోలిస్తే క‌థ లేదు.. అనిల్ ప‌టాస్‌, సుప్రీమ్‌. రాజా ది గ్రేట్‌, ఎఫ్ 2 సినిమ‌ల్లో ఓ మోస్తరు క‌థ ఉంది.. కామెడీ ఎక్కువైనా కామెడీకి, క‌థ‌కు బ్యాలెన్సింగ్ ఉండేది. 

 

అయితే ఈ సినిమాలో అది మిస్ అయ్యింది. క‌థ‌లో స‌రుకు లేదు. కామెడీ డోస్ ఎక్కువైంది. ఈ రెండిటి మ‌ధ్య బ్యాలెన్స్ లేక‌పోవ‌డంతో కొన్నిసార్లు కామెడీ కూడా విసిగించింన‌ట్లు అనిపించింది. మొత్తానికి ప‌ర్వాలేదు అనిపించుకున్నా ముందు ముందు ప్రేక్ష‌కులు చూడ‌డానికి ఎంత వ‌ర‌కు ఆస‌క్తి చూపిస్తారో చూడాలి. కాగా, ఈ సినిమాలో ద్వారా 13 ఏళ్ల తర్వాత విజయశాంతి రీఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే.. ప్రొపెసర్ భారతి అనే పవర్ ఫుల్ పాత్రలో ఆమె కనిపించనుంది. రాజేంద్రప్రసాద్, ప్రకాష్ రాజ్, సంగీత తదితరులు ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: