ర‌ష్మిక గ‌త చిత్రాలు అన్నీ చాలా వ‌ర‌కు హిట్ కొట్టాయి. ఛ‌లో చిత్రంతో తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మైన ఈ భామ గీత‌గోవిందంతో హిట్ కొట్టింది. దాంతో వ‌రుస ఆఫ‌ర్ల‌తో ఫుల్ బిజీ అయిన విష‌యం తెలిసిందే. మ‌రి ఒకేసారి  పెద్ద స్టార్ హీరోతో అవ‌కాశం రావ‌డం ఆమె అదృష్ట‌మ‌నే చెప్పాలి. అనిల్‌రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన చిత్రం `స‌రిలేరు నీకెవ్వ‌రు`. ఒక స్టార్ హీరోతో న‌టించే అవ‌కాశం రావ‌డం మాములు విష‌యం కాదు. ఇక ఈ యంగ్ హీరోయిన్ ఉందంటే సినిమాలో ఇటు మ‌హేష్ అటు ర‌ష్మిక ఇక ఇద్ద‌రి మ‌ధ్య వ‌చ్చే రొమాంటిక్ సీన్స్ గురిచి ప్రేక్ష‌కులు పెద్ద అంచ‌నాలే వేసుకుంటారు.  కానీ ఈ సినిమాలో అది మిస్ చేసేశాడు ద‌ర్శ‌కుడు. వీరిద్ద‌రి మ‌ధ్య ఫ‌స్టాఫ్‌లో వ‌చ్చే కామెడీ సీన్ల వ‌ర‌కు బాగానే న‌డిపించిన ద‌ర్శ‌కుడు సెకండాఫ్‌లో ముప్ఫై నిమిషాలు హీరోయిన్ క్యారెక్ట‌ర్‌ను క‌న‌ప‌డ‌కుండా చేసేశాడు. ఆమె ఫ‌స్టాఫ్‌లో నేను చెప్పేది మీకు అర్థ‌మ‌వుతుందా ? అని సెకండాఫ్‌లో ఐ మాయ్ ఇంప్రెస్‌డ్ అంటూ మ‌హేష్‌ను కౌగిలించుకోవ‌డంతోనే ఆమె క్యారెక్ట‌ర్ స‌రిపోయింది.. మ‌ధ్య‌లో ఒక‌టి రెండు పాట‌ల‌లో క‌నిపించింది..

 

ఇంత‌కీ ర‌ష్మిక నిడివి సినిమాలో ఎంత వ‌ర‌కు ఉందో అర్ధ‌మ‌వుతుందా... మీరంద‌రూ ఇంప్రెస్‌డా... ఎలా ఇంప్రెస్ అవుతారు అనిల్ రావిపూడి. అస‌లు వారిద్ద‌రి మ‌ధ్య కెమిస్ట్రీ ఏది. ఎంత కామెడీ పెడితేమాత్రం కాస్త హీరో హీరోయిన్ అన్నాక ఏదో కొంతైనా రొమాన్స్ ఉండాలిక‌దా ఈ రోజుల్లో ఎక్కువ‌గా అదే క‌దా ఎక్స్‌పెక్ట్ చేసేది. మ‌రీ రొటీన్ రొడ్డ‌లాగా తీస్తే ఎలా ప్రేక్ష‌కులు ఏ విధంగా ఇంప్రెస్ అవుతార‌నుకున్నావ్‌. సినిమాని అనుకున్న టైం కంటే త్వ‌ర‌గా తెర‌కెక్కించ‌డం గొప్ప‌కాదు దాన‌ని ఎంత బాగా ప్ర‌జంటేష‌న్ ఇచ్చామ‌నేదే గొప్ప‌. ఇక సరిలేరు నీకెవ్వరు సినిమా హీరో సూపర్ స్టార్ మహేష్ బాబుకు భరత్ అనే నేను ,మహర్షి సినిమాలు బాక్సాఫీస్ వద్ద విజయాలు పొందాయి. భరత్ అనే నేను 150 కోట్లు కలెక్ట్ చేస్తే ,మహర్షి సినిమా 175 కోట్లు కలెక్షన్ల వర్షం కురిపించింది. సరిలేరు నీకెవ్వరు సినిమా హిట్ అయితే మహేష్ బాబుకు హ్యాట్రిక్ సినిమా అవుతుంది . ఈ హ్యాట్రిక్ తో మరో రికార్డు మహేష్ బాబు ఖాతాలో పడుతుందా లేదా అన్న‌ది తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: