తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబు, రష్మీక హీరో హీరయిన్లుగా నటించిన చిత్రం సరిలేరు నీకెవ్వ‌రు.. అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది.. ఇటీవల విడుదల అయిన మేకింగ్ వీడియో లో నీ కొన్ని సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.. దాంతో సినిమా హిట్ అవుతుందని గట్టి నమ్మకంతో చిత్రం యూనిట్ ఉన్నారు.. 

 

తాజాగా ఈరోజు ఈ చిత్రం విడుదలైంది.. ముందుగా అనుకున్న విధంగా ఈ చిత్రం మంచి హిట్ నీ అందుకుంటుంది అని మహేష్ అభిమానులు అభిప్రపడ్డారు..కానీ తీరా చూస్తే అనుకున్నది ఒకటి అయినది ఒకటి అన్నట్లు ఈ చిత్ర పరిస్థితి మారింది. ఫస్ట్ ఆఫ్ లో సినిమా కొంచెం కామెడీగా సాగినా కూడా సెకండ్ ఆఫ్ లో ప్రేక్షకులు బోర్ లాగా ఫీల్ అవుతున్నారు.. ఎదో ఉంటుంది అని వచ్చిన ప్రేక్షకులకు ఈ సినిమా బోర్ కొట్టడంతో ఇంటర్వెల్ కే వచ్చేస్తున్నారు. 

 

ద‌ర్శ‌కుడు అనిల్‌రావిపూడి సినిమా ప్రారంభ స‌న్నివేశ‌మే విజ‌య‌శాంతితో స్టార్ట్ చేశాడు. విల‌న్ కొడుకు తాగి కాలేజ్‌కు వ‌స్తాడు బాగుంది క‌దా అని అమ్మాయిని ఏడిపిస్తాడు చెంప‌మీద కొడుతుంది. ప్రిన్సిప‌ల్ ద‌గ్గ‌ర‌కు వెళుతుంది. కంప్లైంట్‌.. వెంట‌నే ఆయ‌న కొడుకు వ‌దిలేయ‌మ‌ని ప్రిన్సిప‌ల్  చెపితే మ‌ళ్లీ చెంపమీద లాగి అదిరిపోయే డైలాగ్ చెపుతుంది.. చాలా ప‌వ‌ర్‌ఫుల్‌సీన్‌తో రాముల‌మ్మ  ఎంట్రీతో సినిమా స్టార్టింగ్ సీన్ుంటుంది.

 

మొత్తానికి విజయశాంతి రీ ఎంట్రీ ఈ సినిమాకు ఓ మాదిరిగా కలిసి వచ్చింది.. పవర్ ఫుల్ పాత్రం ఈమె కనిపిస్తుంది.. విలన్ పాత్రలో ప్రకాష్ రాజ్ కనిపించారు. ఎక్కడ ఎమోషన్ ఉండాలో అక్కడ సీన్లు కపించ లేదని మాటలు వినపడుతున్నాయి.. ఈవిధంగా సినిమా ఫస్ట్ ఆఫ్ కామెడీతో  ఆకట్టుకుంది.  రెండో భాగం షూటింగ్ ఈ సినిమాకు మైనస్ పాయింట్స్ నిలిచింది. ఈ సినిమా తర్వాత వంశీ తోనే మరో సినిమాలో నటించనున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: