సూపర్‌స్టార్ మహేష్‌బాబు, సెన్సేషనల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో రూపొందిన తాజా చిత్రం `సరిలేరు నీకెవ్వరు`. ర‌ష్మిక హీరోయిన్‌గా న‌టించిన ఈ చిత్రాన్ని దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సమర్పణలో జీఎంబీ ఎంటర్‌టైన్మెంట్, ఏకే ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్లపై రామబ్రహ్మం సుంకర నిర్మించారు.  ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ మూవీకి అనిల్ రావిపూడి ద‌ర్శ‌కుడు. సంక్రాంతి కానుక‌గా భారీ అంచ‌నాలు న‌డుమ ఈ చిత్రం జ‌న‌వ‌రి 11న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల కానుంది. ఇప్ప‌టికే ఓవర్సీస్‌లో తెలుగు రాష్ట్రాల కంటే ముందే ప్రీమియర్స్ మొదలయ్యాయి. అలాగే ఆంధ్రాలో అర్ధరాత్రి బెనిఫ‌ట్ షోలు ప్రారంభించారు.

 

ఇక సినిమా విష‌యానికి వ‌స్తే.. మొదటగా ఆర్మీ మేజర్ పాత్రలో మహేష్ బాబు అదిరిపోయే ఎంట్రీ తో పాటు అక్కడ వచ్చే యాక్షన్ సీన్ అందరినీ ఆకట్టుకుంటుంది. ఆ త‌ర్వాత వ‌చ్చే ట్రైన్ జ‌ర్నీలో మ‌హేశ్ ను ర‌ష్మిక చూడ‌డం ప్రేమ‌లో ప‌డ‌డం త‌న తండ్రి రావు ర‌మేష్‌ చూసిన పెళ్లి న‌చ్చ‌క‌పోవ‌డం. ఇవ‌న్నీ వెంట వెంట‌నే జ‌రిగిపోతాయి. అయితే ఈ చిత్రంలో ర‌ష్మిక చిన్న పిల్ల‌లా అనిపించింది. డ్యాన్సుల వ‌ర‌కు ఓకే అనిపించినా చాలా చోట్ల గ్లామ‌ర్‌తో మెప్పించ‌లేక‌పోయింది.. స‌రైన మేక‌ప్ టీంను పెట్టుకోలేదేమో అన్నట్టుగా ఉంది. అస‌లు ర‌ష్మిక నుంచి పాట‌ల్లో మిన‌హా ఒక్క అంద‌మైన ఫ్రేము కూడా క‌న‌ప‌డ‌దు. ఆమెకు వేసిన డ్రెస్సులు కూడా సెట్ అవ్వ‌లేదు.

 

ఛ‌లో లాంటి సినిమాల్లో ఆమె చాలా అందంగా ఉంటుంది. గీత‌గోవిందంలో కూడా.. కానీ ఈ సినిమాలో ఆమె పాత్ర‌కు అందం, హుందాత‌నం మిస్ అయ్యాయి. చిలిపి సీన్ల‌లో న‌టించినా అవి కూడా తేలిపోయాయి. మ‌రోవైపు టేకింగ్ లోపం కూడా క‌నిపించింది. అదే విధంగా.. మహేష్‌తో పాట‌ల వ‌ర‌కు ఎలా ఉన్నా సీన్ల‌లో కెమిస్ట్రీ మాత్రం స‌క్సెస్ అవ్వ‌లేద‌నే చెప్పాలి. ఇక‌ వీరిద్ద‌రి మ‌ధ్య ఫ‌స్టాఫ్‌లో వ‌చ్చే కామెడీ సీన్ల వ‌ర‌కు బాగానే న‌డిపించిన ద‌ర్శ‌కుడు సెకండాఫ్‌లో ముప్ఫై నిమిషాలు హీరోయిన్ క్యారెక్ట‌ర్‌ను క‌న‌ప‌డ‌కుండా చేసేశాడు. మ‌రి ఇప్ప‌టి వ‌ర‌కు విజ‌యాలే అందుకున్న ర‌ష్మిక కు ఈ సినిమా హిట్ ఇస్తుందో.. లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: