2019 లో వచ్చిన సంక్రాంతి కానుకగా వచ్చిన ఎఫ్2 సినిమా ఎంత ఘన విజయాన్ని అందుకుంది అన్న విషయం తెలిసిందే.. అయితే ఇప్పుడు మహేష్ తో తెరకెక్కించిన సరిలేరు నీకెవ్వరు సినిమా మాత్రం ఉన్న పేరును పోగొట్టెలా ఉందని మాటలు వినపడుతున్నాయి.. దూకుడు మరియు ఆగడు సినిమాలను మళ్ళీ రిపీట్ అయిందని టాక్..ఈరోజు విడుదల అయిన ఈ సినిమా పరిస్థితి అంతే అంటూ జనాలు అంటున్నారు..

 

ఇకపోతే ప్రతి సినిమాలో రొమాన్స్ కు కేరాఫ్ గా ఉన్న మహేష్ కు ఈ సినిమాలో యూత్ ను ఆకట్టుకునేలా సీన్లు లేవని టాక్ వినపడుతుంది.. మిలటరీ వ్యక్తి పాత్రలో నటించిన మహేష్ ను చూస్తే మహర్షి, శ్రీమంతుడు సినిమాలు గుర్తుకు వస్తున్నాయి అంటున్నారు.మహేష్ అన్నీ సినిమాలను కలబోసి ఈ సినిమా మీద ఎఫోర్ట్ పెట్టిన పెద్దగా కలిసిరాలేదు.. దీంతో సినిమాకు గడ్డుకాలం ఏర్పడింది..

 

ఇకపోతే ఈరోజు రీలీజ్ అయిన ఈ సినిమాకు భారీ అంచనాలే నెలకొన్నాయి.అయితే సినిమాలో హీరో హీరోయిన్లు మద్య సాగే సన్నవేశాలు సినిమాను హిట్ టాక్ ను అందుకునేలా లేదని మహేష్ యాంటీ ఫ్యాన్స్ అంటున్నారు.. సినీ వర్గాల విషయానికొస్తే.. సినిమా రొటీన్ కథనే తీశారు..మహేష్ సినిమాలో ఉన్న జోష్ ఈ సినిమాలో లేకపోవడంతో ఈ సినిమా హిట్ కాలేకపోయింది.. అనిల్ జిమ్మిక్కులు కేవలం ఫస్ట్ ఆఫ్ కే సెట్ అయ్యాయని అంటున్నారు.. సెకండ్ ఆఫ్ సాగదీయడం ఈ సినిమా కలెక్షన్లు గండి పడిందని టాక్..

 

మహేష్ ఫ్యాన్స్ కు కావాల్సిన అన్ని ఎలిమెంట్స్ అన్ని మిస్ చెయ్యకుండా దర్శకుడు అనీల్ అదరగొట్టారని చెప్పాలి.  కామెడీ ట్రాక్స్ అదిరిపోయేలా రావడమే కాకుండా పర్ఫెక్ట్ ఇంటర్వెల్ బ్యాంగ్ ఎపిసోడ్ తో థియేటర్స్ దద్దరిల్లడం ఖాయం. ఈ సినిమాలో గ‌తంలో లేన‌ట్టుగా స‌రికొత్త స్టెప్పులు వేశాడు. 

 

తమన్నాతో ప్లాన్ చేసిన పార్టీ సాంగ్ లో మహేష్ వేసిన స్టెప్పులకు అయితే ఓ సరికొత్త మహేష్ ను చూడొచ్చు. ఇక ర‌ష్మిక‌తో చివ‌రి సాంగ్ మైండ్ బ్లాకు.. మాస్ లుక్కు బాగుంది మైండు బ్లాకు సాంగులో ఇద్ద‌రూ క‌లిసి పోటాపోటీగా స్టెప్పులు వేశారు.. కానీ సినిమాకు ఈ మాత్రం కలిసిరాలేదు..

మరింత సమాచారం తెలుసుకోండి: