సక్సెస్ఫుల్ హీరో మహేష్ బాబు సక్సెస్ఫుల్ దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం సరిలేరు నీకెవ్వరు. మొదటినుంచి ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచేస్తూ వచ్చింది ఈ సినిమా. ఈ సినిమాలో మహేష్ బాబు సరసన రష్మిక మందన నటిస్తుండగా... ఓ కీలక పాత్రలో విజయశాంతి నటిస్తోంది. ఇక ఈ సినిమాలో విలన్ గా ప్రకాష్ నటిస్తున్నారు. అయితే భారీ అంచనాలతో ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ సినిమా. ఇప్పటికే  ట్రైలర్లు టీజర్ లలో తనదైన మార్క్ ను చూపించిన అనిల్ రావిపూడి సినిమాలో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు. ప్రతి చోట అనిల్ రావిపూడి మార్కు స్పష్టంగా కనిపిస్తోంది. ఇక ఎలాంటి సుత్తి లేకుండా సూటిగానే సినిమాను మొదలు పెట్టారు అనిల్ రావిపూడి. మొదలవడం మొదలవడమే తనదైన స్టైల్ కామెడీ పంచులు పేలుస్తూ ప్రేక్షకులందరినీ కడుపుబ్బ నవ్విస్తారు. 

 

 

 

 ఇక ఈ సినిమాలో అనిల్ రావిపూడి మార్క్ స్టైల్ కామెడీ అద్భుతంగా పేలింది అనే చెప్పాలి. ఇక మహేష్ బాబు కామెడీ టైమింగ్ కూడా అదిరిపోయింది. ఇక మిలిటరీ యాక్షన్ సన్నివేశాలు... విజయశాంతి పవర్ ఫుల్ డైలాగ్ లతో సినిమా చూస్తున్న ప్రేక్షకులు అందరూ ఈలలు గోలతో హోరెత్తిపోతూ ఉంటారు. ఫస్టాఫ్ మొత్తం అనిల్ రావిపూడి కామెడీ పంచులు నిండా నింపేసి ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తాడు. ఇక ఆ తర్వాత సెకండాఫ్  నుంచి యాక్షన్ సీక్వెన్స్ మొదలవుతుంది. అయితే సినిమా స్టార్ట్ అవడమే మహేష్ మిలిటరీ  ఫైట్  తో స్టార్ట్ అవుతుంది. మహేష్ బాబు ఎంట్రీ కూడా గ్రాండ్ గా ప్లాన్ చేశాడు అనిల్ రావిపూడి. ఇంకేముంది అభిమానులు అందరూ పండగ చేసుకున్నారు. 

 

 

 

 సగటు సినీ అభిమానికి సరిలేరు నీకెవ్వరు సినిమా ఓ మంచి శుభారంభం  అనే చెప్పాలి. సినిమా చూడడానికి వచ్చిన ప్రేక్షకులని కడుపుబ్బా నవ్వుకునే కామెడీ పంచ్ లతో... యాక్షన్ సన్నివేశాలతో హోరెత్తిపోతున్న ఉంటారు. ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులు తెగ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇక సరిలేరు నీకెవ్వరు సినిమా అయితే మహేష్ బాబు ఫాన్స్ కి మరో సంక్రాంతి పండుగ అని చెప్పాలి. మహేష్ బాబు ఫ్యాన్స్ అందరికీ సంక్రాంతి పండుగ సరిలేరు నీకెవ్వరు సినిమా విడుదల తో ముందే వచ్చేసింది. సరిలేరు నీకెవ్వరు సినిమా లో విజయశాంతి మహేష్ బాబు మధ్య వచ్చే డైలాగ్స్ చాలా బాగుంటాయి. అంతేకాదండోయ్ ఈ  సినిమాలో డాన్సులు కోసం చాలా కష్టపడ్డాడు మహేష్ బాబు. సరికొత్త మహేష్ ని సరిలేరు నీకెవ్వరు సినిమాలో చూడొచ్చు అభిమానులు. మొత్తంగా సరిలేరు నీకెవ్వరు సినిమా బొమ్మ పడింది అంతే.

మరింత సమాచారం తెలుసుకోండి: