ఈ మధ్య కాలం లో స్టార్ హీరోయిన్ గా అవకాశం రావడం చాలా కష్టం. ఇంకా పెళ్లి అయ్యింది అంటే ఆ హీరోయిన్ల జీవితం ముగిసిపోయినట్టే. కొంత మంది అయితే సినిమాల కోసం ఎంతకైనా తెగిస్తుంటారు. సినిమా ఛాన్సులు రావడం కోసం అమ్మతనాన్ని కూడా వద్దు అనుకుంటున్నారు ఈనాటి తారలు. అలా అమ్మతనాన్ని వద్దనుకున్న వారిలో చాలా మందే ఉన్నారు. అయితే ఈ మధ్యనే ఒక సంచలన విషయం బయట పడింది. 

 

అది ఏంటంటే.. ఆ సంచలన నిజం ఏంటంటే.. ఓ స్టార్ హీరోయిన్ కు సినిమా తీస్తున్న సమయంలో అబార్షన్ అయ్యిందట.. ఆ స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా.. ఇంకెవరూ.. అప్పట్లో ఓ వెలుగుల వెలిగిన తార కాజోల్. బాలీవుడ్ లో క్యూట్ కపుల్ అజయ్ దేవగన్ కాజోల్ జంట ఎంత అన్యోన్యంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే అలాంటి క్యూట్ కపుల్ అయినా స్టార్ హీరోయిన్ కాజోల్ కు ఓ సినిమా వల్ల అబార్షన్ అయ్యిందట. 

 

వివరాల్లోకి వెళ్తే.. తన భర్త అజయ్ దేవగణ్‌తో కలిసి నటించిన చిత్రం 'తానాజీ' చిత్రం ప్రేమోషన్స్ లో కాజోల్ ఈ విషాదకరమైన ఘటన గురించి చెప్పుకొచ్చింది. అమితాబ్‌ బచ్చన్‌, జయాబచ్చన్‌, కాజోల్‌, షారుఖ్‌ కీలకపాత్రల్లో నటించిన కుటుంబ కథా చిత్రం 'కబీ ఖుషి కబీ గమ్‌'. ఈ చిత్రం 2001లో విడుదలై బాక్సాఫీస్‌ వద్ద సూపర్‌హిట్‌ చిత్రంగా నిలిచింది. అయితే ఆ సినిమా విడుదల అయినా సమయంలో ఆమెకు అబార్షన్ జరిగింది అని నటి కాజోల్ సంచలన నిజాన్ని బయట పెట్టారు. 

 

దీంతో ఆమె ఫ్యాన్స్ అంత.. ''అయ్యో కాజోల్.. ఎంత కష్టమైన పరిస్థితి వచ్చింది నీకు.. ఎలా ఎదురుక్కున్నావు'' అంటూ బాధ పడిపోతున్నారు. దీంతో ఈ వార్త గత రెండు రోజుల నుండి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయ్యో కాజోల్.. నీకు వచ్చిన కష్టం మరెవ్వరికీ రాకూడదు అంటూ బాధ పడిపోతున్నారు. కాగా నేయున్న తన భర్తతో కలిసి నటించిన తానాజీ చిత్రం విడుదలయ్యింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: