సరిలేరు నీకెవ్వరూ సినిమా ఈరోజు రిలీజ్ అయ్యింది.  సినిమాకు పాస్ మార్కులు పడ్డాయి.  ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది.  సినిమాను ఎంటర్టైనర్ వేలోనే తీశారు.  కానీ, మహేష్ బాబు ఇచ్చిన అవకాశాన్ని అనిల్ పూర్తిగా సద్వినియోగం చేసుకోలేకపోయారు అన్నది ఓ వాదన.  ఎందుకంటే, కేవలం ఐదు నెలల్లోనే సినిమా పూర్తి చేసి రిలీజ్ చేశారు.  ఇంకాస్త సమయం తీసుకొని ఇంకా బాగా తీసి ఉంటె బాగుండేదని అంటున్నారు.  


ఫస్ట్ హాఫ్ వరకు సినిమా సూపర్ అని చెప్తున్నా, సెకండ్ హాఫ్ లో కథ లేకపోవడంతో లాగ్ అయ్యింది.  ప్రీ క్లైమాక్స్ నుంచి బాగుందని, క్లైమాక్స్ చప్పగా ఉందని అంటున్నారు.  అవుట్ అండ్ అవుట్ మంచి మాస్ ఎంటర్టైనర్ ను అందించారని మాత్రం తెలుస్తోంది.  అనిల్ ఇంకాస్త సమయం తీసుకొని ఉంటె తన మార్క్ డిస్టంక్ష‌న్ సినిమా అయ్యి ఉండేదని చెప్తున్నారు. 
ఇప్పటికైతే సినిమాకు పాజిటివ్ టాక్ రన్ అవుతున్నది.

 సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో ఫ్యాన్స్ హంగామా చేస్తున్నారు.  ముఖ్యంగా ట్రైన్ ఎపిసోడ్ బాగున్నట్టుగా చెప్తున్నారు.  మహేష్ మొదటి నుంచి మంచి కామెడీ చేస్తుంటారు.  ఆ కామెడీ ఈ సినిమాలో బాగా వర్కౌట్ అయ్యింది. విజయశాంతిని అనిల్ చూపించిన విధానం బాగుందని అంటున్నారు.  


ఇకపోతే, భారీ క్యాస్టింగ్ తో తీసిన సినిమా కాబట్టి సినిమాలో ఎక్కడ చూసినా జనాలే కనిపిస్తుంటారు.  ఇది కూడా సినిమాకు ప్లస్ అయ్యిందని అంటున్నారు.  ఈ సినిమాకు అనిల్ మంచికథనే ఎంచుకున్నారు.  కానీ, ఆ కథను తెరపై ప్రజెంట్ చేయడంలో కొంత ఇబ్బంది పడ్డారు.  ఇంకాస్త సమయం తీసుకొని ఉంటె కథ మరోలా డీల్ చేసి ఉండేవారు.  సెకండ్ హాఫ్ లాగ్ కావడమే సినిమాకు మైనస్ అయ్యింది. ఇవే కాదు ఇంకా కొన్నింటిపై కూడా అనిల్ దృష్టిపెట్టలేకపోయారు.  కేవలం సమయం లేకనే అని అర్ధం చేసుకోవచ్చు.  అయితే, స్టార్ హీరోలను కూడా హ్యాండిల్ చేయగలడు అని అనిల్ నిరూపించుకున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: