మొదటినుంచి ప్రేక్షకుల్లో భారీ అంచనాలను కలుగజేస్తూ హిట్ కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం సరిలేరు నీకెవ్వరు. సక్సెస్ ఫుల్ హీరో మహేష్ బాబు సక్సెస్ ఫుల్ దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ చిత్రం. కాగా ఈ సినిమాలో మహేష్ బాబు సరసన రష్మిక మందన నటిస్తుండగా... ఓ కీలక పాత్రలో విజయశాంతి నటిస్తోంది. ఇక ఈ సినిమాలో విలన్ గా ప్రకాష్ నటిస్తున్నారు. అయితే భారీ అంచనాలతో ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ సినిమా. ఇప్పటికే  ట్రైలర్లు టీజర్ లలో తనదైన మార్క్ ను చూపించిన అనిల్ రావిపూడి సినిమాలో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు. ప్రతి చోట అనిల్ రావిపూడి మార్కు స్పష్టంగా కనిపిస్తోంది. ఇక ఎలాంటి సుత్తి లేకుండా సూటిగానే సినిమాను మొదలు పెట్టారు అనిల్ రావిపూడి. మొదలవడం మొదలవడమే తనదైన స్టైల్ కామెడీ పంచులు పేలుస్తూ ప్రేక్షకులందరినీ కడుపుబ్బ నవ్విస్తారు. 

 

 

 

 అయితే సరిలేరు నీకెవ్వరు సినిమాలో  మరో సారి అనిల్ రావిపూడి  మార్కు స్పష్టంగా కొట్టొచ్చినట్లు కనిపించింది. సూటిగా సినిమాను మొదలు పెట్టిన దర్శకుడు అనిల్ రావిపూడి.. మొదటి నుంచే సినిమాలో అద్భుతమైన పంచ్ లతో అదరగొట్టాడు. ఇక మహేష్ బాబు కూడా తనదైన స్టైల్ లో కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులని కడుపుబ్బా నవ్వించాడు. 13 ఏళ్ల తర్వాత రీఎంట్రీ ఇస్తున్న విజయశాంతి సరిలేరు నీకెవ్వరు సినిమాలో తన పవర్ ఏంటో మరోసారి నిరూపించుకుంది. మహేష్ ఫ్యాన్స్ అందరికీ సరిలేరు నీకెవ్వరు సినిమా మరో సంక్రాంతి పండుగ అని చెప్పాలి. సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అనిల్ రావిపూడి తన మార్క్ కామెడీని ప్రదర్శనలు ఇస్తూ ప్రేక్షకులని కడుపుబ్బా నవ్వించాడు. ఏకంగా యాక్షన్ సన్నివేశాలకు కూడా కామెడీ జోడించాడు అనిల్ రావిపూడి. అయితే ఇక్కడ వరకు అంతా బాగానే ఉన్నప్పటికీ... ఈ సినిమాలో అందాల ముద్దుగుమ్మ రష్మిక మందన్న విషయంలో మాత్రం ఎక్కడో తేడా కొట్టేసింది. 

 

 

 ఎందుకంటే రష్మిక ఇప్పటివరకూ నటించిన సినిమాలన్నింటిలో ఎంతో హుందాగా అందం అభినయం కలగలిసిన ముద్దుగుమ్మ గా నటించింది.. కానీ సరిలేరు నీకెవ్వరు సినిమాలో మాత్రం రష్మిక  పాత్రను దర్శకుడు ఇంకొంచెం బాగా తీర్చిదిద్దితే బాగుండేది అని ప్రేక్షకులు భావిస్తారు. ఈ సినిమాలో రష్మిక మేకప్పు ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఇక ఆమె గెటప్ కూడా ప్రేక్షకులకు అంతగా ఆకర్షించలేదు. ఇక రష్మిక చెప్పే డైలాగులు కూడా అక్కడక్కడ పేలినప్పటికీ ఎక్కువశాతం ప్రేక్షకులను మాత్రం నవ్వించలేకపోయాయి అని ప్రేక్షకులు అంటున్నారు. ఇదేంటబ్బ అనిలూ... రష్మిక పాత్ర పైన కొంచెం కాన్సెంట్రేట్ చేసి ఉంటే బాగుండేది కదా అనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రష్మిక గెటప్ మేకప్ విషయంలో ఇంకొంచెం జాగ్రత్తలు తీసుకుంటే బాగుండేదబ్బా అనీలూ... అర్థం అవుతుందా అని అనుకుంటున్నారు ప్రేక్షకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: