సరిలేరు నీకెవ్వరు... ఈ సినిమాపై అన్ని అంశాలు ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచేశాయి. వరుస బ్లాక్ బస్టర్ తో దూసుకుపోతున్న సక్సెస్ ఫుల్ హీరో మహేష్ బాబు నటిస్తుండటం.. చేసిన సినిమాలన్నీ విజయం సాధించేలా మలచిన అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తుండడం... ఏ హీరో పక్కన నటించినా ఆ హీరోకి సరైన జోడీ అనిపించుకుంటు యూత్ అందరినీ ఆకర్షిస్తున్న రష్మిక మందన ఈ సినిమాలో నటిస్తుండడం... పదమూడేళ్ల తర్వాత పవర్ ఫుల్ యాక్షన్ తో టాలీవుడ్ సూపర్ స్టార్ విజయశాంతి రీ ఎంట్రీ ఇస్తుండడం ఇవన్నీ కలిపి సరిలేరు నీకెవ్వరు సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెంచేశాయి. ఇక ఎన్నో రోజులనుండి ఎప్పుడెప్పుడా ఈ సినిమా విడుదల అని వేయికళ్ళతో ఎదురు చూస్తున్న అభిమానుల కోరిక నేడు  తీరిపోయింది. అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొల్పిన  సరిలేరు నీకెవ్వరు సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 

 

 

 ఇక ఈ సినిమా ప్రేక్షకులందరినీ అద్భుతంగా ఆకట్టుకుంటూ దూసుకుపోతుంది.. సక్సెస్ ఫుల్ దర్శకుడు సక్సెస్ ఫుల్ హీరో కాంబినేషన్లో సినిమా వస్తే ఎలా ఉంటుందో అదే రేంజ్ లో ఉంది సరిలేరు నీకెవ్వరు సినిమా. సినిమా స్టార్ట్ అవ్వడమే కామెడీ పంచ్ లతో స్టార్ట్ అయి ప్రేక్షకులని కడుపుబ్బా నవ్విస్తూ దూసుకుపోతుంది. దర్శకుడు అనిల్ రావిపూడి తనదైన స్టైల్ లో కామెడీ పంచ్ కామెడీ టైమింగ్ సినిమాలో  బాగా దట్టించి సినిమా చూస్తున్న ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించేసాడు. నాన్ స్టాప్ కామెడీ తో అదిరిపోయే యాక్షన్ తో ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ప్రేక్షకుల అంచనాలు అన్నింటిని సంతృప్తి పరుస్తూ ఈ సినిమా దూసుకుపోతుంది. మరోసారి ఈ సినిమాతో మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు అని నిరూపించుకున్నారు. 

 

 

 అయితే ఈ సినిమా ఫస్టాఫ్ మొత్తం ఫుల్ కామెడీ పంచ్ లతో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తూ దూసుకు పోయినప్పటికీ.... సెకండాఫ్ లో మాత్రం ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేదు అని ప్రేక్షకులు భావిస్తున్నారు. చాలా సింపుల్ కథను రాసుకున్న దర్శకుడు అనిల్ రావిపూడి తనదైన ట్రీట్మెంట్ ఇచ్చి సినిమాను ఏదోలా ముందుకు తీసుకెళ్ళాడు. ఫస్టాఫ్ కామెడీ బాగా పేలింది. అయితే ఎంతో హైప్ ఇచ్చిన ట్రైన్ అండ్ బండ్ల గణేష్ ఎపిసోడ్ మాత్రం ప్రేక్షకులను అంతగా నవ్వించ లేకపోవడం ఈ సినిమాకు ఒక మైనస్ అయిందని చెప్పాలి. ఇక హీరోయిన్ రష్మిక మందన్న ట్రాక్ కూడా సెకండాఫ్లో బోరింగ్ గా అనిపిస్తుంది ప్రేక్షకులకు . సెకండాఫ్ లో సీరియస్ గా ఉండాల్సిన చోట కూడా కామెడీని ఇరికించేశాడు దర్శకుడు... ఇక చివర్లో క్లైమాక్స్ మాత్రం డిజాస్టర్ అయిపోయింది. మహేష్ లాంటి పెద్ద హీరోలకు క్లైమాక్స్ ఎలా ఇవ్వాలో తెలియక అనిల్ రావిపూడి క్లైమాక్స్ ని అసంతృప్తిగానే ముగించేశాడు అని ప్రేక్షకులు భావిస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: