టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సక్సెస్ఫుల్ దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం సరిలేరు నీకెవ్వరు. ఈ సినిమా మొదటి నుంచి ప్రేక్షకుల్లో భారీ అంచనాలను కలుగజేస్తూ దూసుకుపోయింది. ఈ సినిమాలో మహేష్ బాబు అనిల్ రావిపూడి రష్మిక మందన్న విజయశాంతి ఇలా అందరి పాత్రలు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెంచేశాయి. ఒక సక్సెస్ ఫుల్ హీరో ఒక సక్సెస్ఫుల్ దర్శకుడు కాంబినేషన్లో సినిమా వస్తే ఎలా ఉంటుందో అదే రేంజ్ లో ఉంది సరిలేరు నీకెవ్వరు సినిమా. కాగా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సరిలేరు నీకెవ్వరు సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈ సినిమా కి ప్రేక్షకుల నుండి వస్తున్న రెస్పాన్స్ చూస్తే మహేష్ ఖాతా లో మరో భారీ హిట్ చేరడం ఖాయమని అర్థమవుతుంది. అనిల్ రావిపూడి తనదైన మార్క్ కామెడీని సరిలేరు నీకెవ్వరు సినిమాలో అద్భుతంగా పేలేలా  తెరకెక్కించారు... ఇక అనిల్  రావిపూడి కామెడీ టైమింగ్ కి మహేష్ బాబు కామెడీ టైమింగ్ తోడవడంతో అది ఒక రేంజ్ లో ప్రేక్షకుల్లో కి వెళ్ళిపోయింది... కడుపుబ్బ నవ్వించే చేసింది. 

 

 

 అయితే ఈ సినిమాలో మహేష్ బాబు చాలా యాక్టివ్గా దూకుడుగా కనిపించారు. అద్భుతమైన కామెడీని పేలుస్తూ.. అదిరిపోయే యాక్షన్ సన్నివేశాలతో విలన్ల వెన్నులో వణుకు పుట్టిస్తూ సినిమా చూస్తున్న ప్రేక్షకులందరినీ హోరెత్తించారు మహేష్ బాబు. ఈ సినిమాలో మరింత ఫిట్ గా  కనిపించాడు మహేష్ బాబు. ఇక డాన్సులు కూడా అదరగొట్టేశాడు మహేష్ బాబు. ఇంతకుముందు మహేష్ బాబు కంటే సరిలేరు నీకెవ్వరు సినిమాలు ఎంతో దూకుడుగా ఎంతో ఎంత ఎంటర్టైనింగ్ గా .. కనిపిస్తారు మహేష్ బాబు. ఇక తన డాన్స్ లతో కూడా ప్రేక్షకులందరినీ అద్భుతంగా అలరిస్తాడు. ఇక  మహేష్ ఫ్యాన్స్ అందరికీ సరిలేరు నీకెవ్వరు సినిమా మరో సంక్రాంతి పండుగ అనే చెప్పాలి.

 

 

 అయితే మహేష్ బాబు గతంలో శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన దూకుడు సినిమాలో కూడా తన దూకుడును చూపించి ప్రేక్షకులందరినీ హోరెత్తించారు. తెలంగాణ యాసలో డైలాగులు చెబుతూ అద్భుతమైన నటనతో ప్రేక్షకులని ఆకట్టుకుని  బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టాడు మహేష్ బాబు. ఎప్పుడు సరిలేరు నీకెవ్వరు సినిమా చూస్తుంటే కూడా మరో దూకుడు కావడం ఖాయంగా కనిపిస్తోంది. అనిల్ రావిపూడి తనదైన స్టైల్లో కామెడీని దట్టించి గతంలో మహేష్ బాబు దూకుడు సినిమాను మించిన కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించేస్తున్నాడు. అయితే కొంత మంది ప్రేక్షకులు దూకుడు కు మించి  సరిలేరు నీకెవ్వరు లో కామెడీ హిట్ అవుతుందని అనుకుంటున్నారు... ఇంకొంతమంది అబ్బే దూకుడు అంత కామెడీ లేదే... తేలిపోయిందిగా  అనుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: