సక్సెస్ఫుల్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సరిలేరు నీకెవ్వరు  సినిమా మొదటి నుంచి ప్రేక్షకుల్లో భారీ అంచనాలను కలుగజేస్తూ దూసుకుపోయింది. ఈ సినిమాలో మహేష్ బాబు అనిల్ రావిపూడి రష్మిక మందన్న విజయశాంతి ఇలా అందరి పాత్రలు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెంచేశాయి. ఒక సక్సెస్ ఫుల్ హీరో ఒక సక్సెస్ఫుల్ దర్శకుడు కాంబినేషన్లో సినిమా వస్తే ఎలా ఉంటుందో అదే రేంజ్ లో ఉంది సరిలేరు నీకెవ్వరు సినిమా. కాగా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సరిలేరు నీకెవ్వరు సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈ సినిమా కి ప్రేక్షకుల నుండి వస్తున్న రెస్పాన్స్ చూస్తే మహేష్ ఖాతా లో మరో భారీ హిట్ చేరడం ఖాయమని అర్థమవుతుంది. అనిల్ రావిపూడి తనదైన మార్క్ కామెడీని సరిలేరు నీకెవ్వరు సినిమాలో అద్భుతంగా పేలేలా  తెరకెక్కించారు... ఇక అనిల్  రావిపూడి కామెడీ టైమింగ్ కి మహేష్ బాబు కామెడీ టైమింగ్ తోడవడంతో అది ఒక రేంజ్ లో ప్రేక్షకుల్లో కి వెళ్ళిపోయింది... కడుపుబ్బ నవ్వించే చేసింది. 

 

 

 అయితే ఈ సినిమా కోసం మహేష్ బాబు బాగానే కష్టపడ్డాడు. అద్భుతమైన కామెడీ టైమింగ్ కోసం... అదిరిపోయే యాక్షన్ సీన్ల కోసం... మునుపెన్నడూ లేని అద్భుతమైన డాన్స్ కోసం... అంతకు మించిన ఫిట్నెస్ కోసం... ఇలా ప్రతి విషయంలో మహేష్ బాబు ఫుల్ ఎఫర్ట్  పెట్టినట్లు కనిపిస్తోంది. అందుకే ఈ సినిమా బలంగా ప్రేక్షకుల్లో కి వెళ్ళిపోయింది. సరిలేరు నీకెవ్వరు సినిమా కామెడీ సినిమా చూస్తున్న ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుంది. అయితే ఈ సినిమాలో మహేష్ బాబు  మరీ సన్నగా మారిపోయారు. అంతకుముందు మరీ సన్నగా కాకుండా మరీ లావుగా కాకుండా సరైన ఫిట్నెస్ తో ఉండి మిల్కీ బాయ్ లా  ఉండే మహేష్ బాబు... సరిలేరు నీకెవ్వరు సినిమాలో ఫిట్నెస్ పై  ఇంకా ఎక్కువ దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో కూడా తాను ఈ సినిమాలో ఫిట్ గా  కనిపించడానికి ఏకంగా 6 కిలోలు బరువు  తగ్గాను అంటూ హీరో మహేష్ బాబు స్వయంగా తెలిపారు.

 

 

 అయితే ప్రతి సినిమాలో మిల్కీ బాయ్ లా కనిపిస్తూ అమ్మాయిల మనసులు కొల్లగొట్టే మహేష్ బాబు ఈ సినిమాలో మరీ సన్నగా కనిపించడంతో ప్రేక్షకులందరూ మా మిల్కీ బాయ్ ఎక్కడ అని అనుకుంటున్నారు. మహేష్ బాబు మరి ఇంతలా చిక్కిపోయారు అని అనుకుంటున్నారు. ఇక మిల్కీ బాయ్ గా పిలుచుకునే మహేష్ బాబు అందం కాస్త ఫిట్నెస్ మీద దృష్టి పెట్టడంతో... సరిలేరు నీకెవ్వరు సినిమాలో అంతగా కనిపించడం లేదని ప్రేక్షకులు అనుకుంటున్న మాట. ఇక సినిమా విషయానికి వస్తే మాత్రం మరోసారి మహేష్ బాబు ఖాతాలో  భారీ హిట్ చేరడం ఖాయంగా కనిపిస్తోంది. సరిలేరు నీకెవ్వరు సినిమా బొమ్మ పడింది అన్నట్లుగానే ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: