వరుస హిట్ సినిమాలతో దూసుకుపోతున్నారు మహేష్ బాబు . గతంలో మహర్షి సినిమా తో ఒక స్టూడెంట్ గా ఒక సక్సెస్ ఫుల్ బిజినెస్ మెన్ గా...  ఒక మంచి ఫ్రెండ్ గా ప్రేక్షకులందరినీ ఆకట్టుకుని బ్లాక్ బస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక ఇప్పుడు సక్సెస్ఫుల్ దర్శకుడు అనిల్ రావిపూడి సక్సెస్ఫుల్ హీరో మహేష్ బాబు కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం సరిలేరు నీకెవ్వరు. ఈ సినిమా మొదటి నుంచి ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచింది. ఇప్పటికే అనిల్ రావిపూడి చేసిన సినిమాలన్నీ మంచి విజయం సాధించడం... మరోవైపు వరుస విజయాలతో మహేష్ బాబు దూసుకుపోతుండంతో హిట్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడం ఖాయం  అని ప్రేక్షకులు అంచనాలు పెంచుకున్నారు. 

 

 

 కాగా ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా కొన్ని వర్గాల ప్రేక్షకులను మాత్రమే ఆకట్టుకుంటుందని టాక్ వినిపిస్తోంది. ఒక సాధారణమైన కథకు దర్శకుడు అనిల్ రావిపూడి తనదైన ట్రీట్మెంట్ ఇచ్చి ముందుకు తీసుకొచ్చాడు. దీంతో మొదటి నుంచే కామెడీ పంచులు వేస్తూ అనిల్ రావిపూడి ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించే ప్రయత్నం చేశాడు. ఇక ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెంచేసిన ట్రైన్స్ ఎపిసోడ్ సినిమాలు అంతగా పేలలేదు. కామెడీతో కడుపుబ్బా నవ్వించాలని   నిర్మాత బండ్ల గణేష్ ను  ఈ సినిమాలో కమెడియన్గా మార్చేసినప్పటికీ కూడా అంతగా వర్కవుట్ కాలేదు. దీంతో అక్కడక్కడా కామెడీ సీన్లు పేలినప్పటికీ... కొన్ని కామెడీ సీన్లు మాత్రం ప్రేక్షకులకు బోరింగ్ గానే కనిపిస్తాయి. 

 

 

 గత మహేష్ బాబు సినిమా మహర్షి తో పోలిస్తే సరిలేరు నీకెవ్వరు అంతగా ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోతున్నది  అని టాక్ వినిపిస్తోంది. మహర్షి సినిమాలో సక్సెస్ కోసం పరిగెత్తే స్టూడెంట్ గా... సక్సెస్ఫుల్ బిజినెస్ మాన్ గా .. ఒక మంచి ఫ్రెండ్ గా.. ఇలా అన్ని షేడ్స్ లో మహేష్ బాబు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు . కానీ సరిలేరు నీకెవ్వరు సినిమాలో మాత్రం దర్శకుడు పూర్తిగా కామెడీ పైనే దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. సీరియస్ యాక్షన్ సన్నివేశాల్లో కూడా కామెడీని జోడించాడు దర్శకుడు. దీంతో ఈ సన్నివేశాలు అక్కడక్కడ ప్రేక్షకులకు అంతగా మెప్పించలేక పోతున్నాయి. దీంతో మహేష్ బాబు  మహర్షి సినిమాలో సరిలేరు నీకెవ్వరు సినిమా ముప్పావు కూడా లేదు అని ప్రేక్షకులు అనుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: