టాలీవుడ్ లోకి ఏం మాయ చేసావే మూవీతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది నటి సమంత.  మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకుల మనసు దోచిన ఈ అమ్మడు..తర్వాత స్టార్ హీరోల సరసన వరుసగా నటించి స్టార్ హీరోయిన్ గా మంచి పేరు తెచ్చుకుంది.  తెలుగు, తమిళంలో వరుస బిజీలతో ఉన్న సమంత ‘ఏం మాయ చేసావే’ మూవీలో తన సహనటుడు అక్కినేని నాగ చైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకుంది.  కొంత కాలం డేటింగ్ చేసిన ఈ జంట పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు.  అయితే వివాహం తర్వాత సహజంగా హీరోయిన్లు సినిమాలకు గుడ్ బాయ్ చెబుతుంటారు.. కానీ సమంతకు మాత్రం పెళ్లైన తర్వాత వరుసగా టాప్ హిట్స్ కలిసి వస్తున్నాయి.

 

అంతే కాదు పెళ్లైన తర్వాత నాగ చైతన్య, సమంత కలిసి నటించిన ‘మజిలీ’ సూపర్ హిట్ అయ్యింది.  తాజాగా  త‌మిళ సూప‌ర్ హిట్ చిత్రం 96కి రీమేక్‌గా జాను మూవీ తెర‌కెక్కుతుండ‌గా, ఇందులో శర్వానంద్‌, స‌మంత ప్ర‌ధాన పాత్ర‌లు పోషించారు.  తమిళ వెర్షన్‌ను తెరకెక్కించిన ప్రేమ్‌కుమార్‌ తెలుగులో కూడా డైరెక్ట్‌ చేస్తున్నాడు. ఈ మూవీ తమిళ్ వెర్షన్ లో సమంత నటించిన పాత్రలో త్రిష నటించిన విషయం తెలిసిందే. ఇటీవ‌ల చిత్ర టీజ‌ర్ విడుద‌ల కాగా, ఈ టీజ‌ర్ సినిమాపై అంచ‌నాలు పెంచింది.

 

అయితే టీజ‌ర్‌ని చూసిన ఓ నెటిజ‌న్ స‌మంత ప‌ర్‌ఫార్మెన్స్ చాలా బాగుంది.  కామెడీ, ఎమెషన్స్ చిన్న టీజర్ లోనే ఇంత అద్భుతంగా చూపించిందే అంటున్నారు.  స‌మంత మంచి న‌టి అని ట్వీట్ చేశారు. దీనికి స్పందించిన స‌మంత ఆ నెటిజ‌న్‌కి కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేస్తూ.. త్రిష‌ని కాపీ కొట్టే ప్ర‌య‌త్నం ఎక్క‌డా చేయ‌లేదు. నా స్టైల్ నాదే అన్నారు.  దిల్‌ రాజ్‌-శిరీష్‌ ఈ మూవీ నిర్మిస్తున్నారు. గోవింద్‌ వసంత ఈ మూవీకి సంగీతం అందిస్తున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: