ఈరోజు విడుదలైన ‘సరిలేరు నీకెవ్వరు’ అర్దరాత్రి షోలు అదేవిధంగా తెల్లవారుజామున షోలు పూర్తి కావడంతో ఈ మూవీకి సంబంధించిన టాక్ నెమ్మదినెమ్మదిగా బయటకు వస్తోంది. వాస్తవానికి ఈ మూవీకి పాజిటివ్ రిపోర్ట్స్ వస్తున్నా ఈ మూవీ హీరోయిన్ రష్మిక పై మాత్రం నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి. 

ఈ సినిమాను ఇప్పటికే చూసిన ప్రేక్షకులు మహేష్ బాబు అద్భుతమైన నటనను పొగుడ్తూ మహేష్ రష్మిక ల కాంబినేషన్ పై పెదవి విరుస్తున్నారు. ఈ ఇద్దరి రొమాంటిక్ ట్రాక్ సీన్స్ లో రష్మిక వల్ల అదనంగా వచ్చిన ఎటువంటి ప్రయోజనం లేదనీ మహేష్ ముందు రష్మిక చిన్న పిల్లలా కనిపించింది అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.

వాస్తవానికి పాటలలో చాల హుషారుగా రష్మిక నటించినా వీరిద్దరి రొమాంటిక్ సీన్స్ లో ఎదో కనిపించని లోటు ఉంది అంటూ కామెంట్స్ వస్తున్నాయి. దీనితో ‘సరిలేరు నీకెవ్వరు’ ఘన విజయానికి రష్మిక మైనస్ గా మారుతుందా అన్న సందేహాలు కలుగుతున్నాయి. ఈ సినిమాలో ఆమె గ్లామర్ షోకు పడే మార్కులను బట్టి మిగతా టాప్ యంగ్ హీరోలు తమ భవిష్యత్ సినిమాలకు సంబంధించి రష్మికను ఎంపిక చేసుకునే పరిస్థితి ఉంటుంది. 

లేదంటే సాయి పల్లవి కీర్తి సురేశ్ లు టాప్ యంగ్ హీరోల పక్కన ఎలా సరిపోరు అన్న కామెంట్స్ వచ్చాయో అలాంటి పరిస్థితి రష్మికకు  కూడ ఏర్పడే ఆస్కారం ఉంది. వాస్తవానికి ప్రస్తుతం రష్మిక డేట్స్ ఇస్తే చాలు అన్న మ్యానియా ఇప్పుడు ఇండస్ట్రీలో కొనసాగుతోంది. దీనికితోడు అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో నటించబోయే సినిమాలో కూడ రష్మికను ఎంపిక చేసే విషయంలో ప్రస్తుతం ఆమె పై వస్తున్న నెగిటివ్ కామెంట్స్ ప్రభావాన్ని చూపించే ఆస్కారం ఉంది అన్న మాటలు వినిపిస్తున్నాయి. దీనితో ‘సరిలేరు నీకెవ్వరు’ కు రష్మిక ప్లస్ గా మారుతుందా లేదంటే మైనస్ గా మారుతుందా అన్న విషయమై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: