బుల్లితెరపై తన సత్తా చాటుతూ నెంబర్ వన్  యాంకర్ గా కొనసాగుతున్నారు ప్రదీప్ మాచిరాజు. తనదైనా వాక్చాతుర్యంతో బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంటారు ప్రదీప్  మాచిరాజు . ఓ వైపు తన యాంకరింగ్ కి ఎనర్జీని జోడిస్తూనే మరోవైపు ఎలాంటి వల్గారిటీ లేకుండా ఎవ్వరినీ హర్ట్ చేయకుండా అసలు సిసలైన యాంకర్గా దూసుకుపోతున్నాడు ప్రదీప్. ఇక ప్రదీప్ కు  హీరోల రేంజ్ లో క్రేజ్ కూడా ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఇక ఎలాంటి షోలోనైనా తనదైన వాక్చాతుర్యంతో రక్తికట్టించ గల సత్తా యాంకర్ ప్రదీప్ సొంతం. ఇప్పటికే ఎన్నో ఛానళ్లలో మరెన్నో ప్రోగ్రామ్స్ చేసి బుల్లితెర ప్రేక్షకుల్లో  ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు యాంకర్ ప్రదీప్ మాచిరాజు. ఇక ప్రదీప్ యాంకరింగ్ చేసిన షోలలో  ఎక్కువగా పాపులారిటీ తెచ్చింది ఈ టీవీలో ప్రసారమయ్యే డాన్స్ రియాల్టీ షో ఢీ  అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఢీ షోలో  యాంకరింగ్ తర్వాత ప్రదీప్ క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. 

 

 

 అయితే గత కొంత కాలంగా అనారోగ్య సమస్యతో బాధ పడిన ప్రదీప్ ఆ తర్వాత ఢి షో లో కి యాంకర్ గా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. యాంకర్ గా ఎంట్రీ ఇచ్చిన తర్వాత తనదైన స్టైల్ కామెడీతో అద్భుతంగా బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంటూ దూసుకుపోతున్నాడు. ఇక బుల్లితెర షోలల్లోనే కాకుండా సినిమా ఈవెంట్లలో కూడా తనదైన శైలిలో యాంకరింగ్ చేస్తూ అదరగొడుతున్నాడు యాంకర్ ప్రదీప్. బుల్లితెర ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న యాంకర్ గా ప్రదీప్ మొదటి వరుసలో కనిపిస్తాడు. ప్రదీప్ యాంకరింగ్లో తోటి సభ్యులను...  అటు ఆడియెన్స్  కూడా ఎవరు హర్ట్ కాకుండా సమయస్ఫూర్తితో మాట్లాడడం ప్రదీప్ ప్రత్యేకత. గత కొంతకాలంగా ప్రదీప్ ఢీ షో నుంచి తప్పుకుంటున్నట్లు వార్తలు వచ్చాయి. 

 

 

 ఇక ఢీ  షో వచ్చే వారానికి సంబంధించి విడుదలైన ప్రోమో లో కూడా ప్రదీప్ కనిపించకపోవడం ఈ వార్తలకు మరింత బలాన్ని చేకూర్చింది. నిజంగానే ప్రదీప్ ఢీ షో నుంచి తప్పుకుంటున్నరా దానికి కారణం ఏంటి అని అభిమానులు అయోమయంలో పడ్డారు. ప్రదీప్ హీరోగా ఒక సినిమా రూపొందనుంది. ఈ సినిమా షూటింగ్ కారణంగానే ప్రదీప్ ఢీ షో నుంచి తప్పుకుంటున్నాడని  అంటున్నారు సినీ వర్గాలు. ఇప్పటివరకు వెండితెరపై చిన్న చిన్న పాత్రల్లోనే మెరుస్తూ వచ్చిన ప్రదీప్... హీరో గా వెండితెరపై తెలుగు ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమవుతున్నాడు అని సమాచారం. ఈ కారణంగానే ప్రదీప్ ఢీ షో నుంచి తప్పుకుంటున్నట్లు బుల్లితెర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: