రేపటిరోజున విడుదలకాబోతున్న ‘అల వైకుంఠపురములో’ మూవీని ప్రమోట్ చేస్తూ పూజ హెగ్డే బన్నీ అభిమానుల కోసం ఒక స్వీట్ న్యూస్ అందించింది. షూటింగ్ స్పాట్ లో అల్లు అర్జున్ తో తాను చాల ఫోటోలు తీయించుకున్నాను అని అయితే ఆ ఫోటోలు అన్నీ ఎక్స్ క్లూజివ్ స్టిల్స్ అని అవి త్వరలోనే బయట పెడతాను అంటూ పూజ హెగ్డే జోక్ చేసి బన్నీ అభిమానులకు షాక్ ఇచ్చింది. 

వాస్తవానికి తాను చాల ఫోటోలు అల్లు అర్జున్ తో తీయించుకున్నా తనకు సమయం కుదరకపోవడం వల్ల వాటిని షేర్ చేయలేకపోయానని పూజ కామెంట్ చేసింది. అంతేకాదు ఆ ఫోటోలు అన్నీ ప్లాన్ చేసి తీయించుకున్నవి కావని అప్పటికప్పుడు షూటింగ్ స్పాట్ లో తమకు అనిపించి తీయించుకున్న ఫోటోలు అంటూ ఆ ఫోటోల పై అంచనాలు పెంచుతోంది. 

ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించిన మూడు పాటలు సూపర్ హిట్ అవడం పై తన ఆనందాన్ని షేర్ చేసుకుంటూ ఈ మూవీలోని ‘సాజమవరగమన’ ‘రాములో రాములు’ ‘బుట్టబొమ్మ’ సాంగ్స్ అన్నీ హీరోయిన్ గా తనను ఉద్దేశించి పాడినవే అంటూ ఆ సినిమాలో హీరోయిన్ గా నటించడం తన అదృష్టం అని అంటోంది. అదేవిధంగా ఈ  సినిమాలోని  ఆ 3 పాటలు తన  చుట్టూనే  తిరగడం తనకు అనందం కలిగించే విషయం అని అంటోంది ఈ డస్కీ బ్యూటీ.

త్రివిక్రమ్ తో రెండోవసారి వర్క్ చేసిన పూజాహెగ్డేను ‘అరవింద సమేతతో’ పోలిస్తే ‘అల వైకుంఠపురములో’ సినిమాలో చాలా గ్లామర్ గా చూపించాడని ఫస్ట్ టైమ్ ఆమె పై కామెడీ కూడా ట్రై చేశాడని వార్తలు వస్తున్నాయి. దీనికితోడు ఈమూవీ విడుదల తరువాత నటిగా కూడ పూజ హెగ్డే కి మంచి ప్రశంసలు వస్తాయి అని వస్తున్న వార్తలను చూసి పూజ మంచి జోష్ లో ఉంది.. 

మరింత సమాచారం తెలుసుకోండి: