టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ రష్మిక మందన్న హీరో హీరోయిన్స్ గా నటించిన తాజా సినిమా 'సరిలేరు నీకెవ్వరు'.  కమ్ర్షియీల్ సక్సస్ చిత్రాల దర్శకుడు అనిల్ రావుపూడి ఈ సినిమా కి దర్శకత్వం వహించాడు. ఇక ఈ సినిమా ఈ రోజు (11) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక సీనియర్ నటి విజయశాంతి 13 ఏళ్ళ తర్వాత అనిల్ చెప్పి ఒప్పించిన ఒక కీలక పాత్రతో సరిలేరుతో రీ ఎంట్రీ ఇచ్చారు. రాజేంద్ర ప్రసాద్, రావు రమేష్, సుబ్బరాజు, శ్రీనివాస రెడ్డి, హరితేజ, సంగీత వెన్నెలకిషోర్, సత్యదేవ్ తదితరులు ఇతర పాత్రల్లో నటించి సందడి చేశారు. ఇక సూపర్ స్టార్ ఆర్మీ మేజర్ పాత్రలో ఎంట్రీ మాత్రమే అదిరిపోయింది. రాం లక్ష్మన్ లు కంపోజ్ చేసిన యాక్షన్ సీన్ ఈ నేపథ్యంలో వచ్చే సాంగ్ ఏదో ఉన్నాయి తప్ప అబ్బా...అనిపించేలా లేవు అని ఆడియన్స్ చెప్పుకుంటున్నారు.

 

పాపం అనీల్ కి మహెష్ బాబు అనగానే ఏమైందో ఏమో గాని మొహం మొత్తం నవ్వు పూసుకొని లోపల విపరీతమైన టెన్షన్ తో సినిమా చేసినట్టున్నాడు. అందుకే ఫస్టాఫ్ ని కామెడీ తో లాగించి సరిపెట్టుకున్నాడు. దీన్ని జనాలు ఒప్పుకుంటారా లేదా అని కూడా ఆలోచించలేదనిపిస్తుంది. ఆ కామెడీ కూడా వెగుటు పుడుతుందట. పైగా ఆయనగారి కామెడీ జంధ్యాల గారి కామెడీ తో పోలిక పెట్టుకున్నాడు. అందుకే జనాలు అలానే ట్రోల్ చేయడం మొదలు పెట్టారు. ఇక సెకండ్ హాఫ్ మాత్రం ఇంట్రెస్టింగ్ గా తీయాలని ట్రై చేసినప్పటికి అది కూడా బెడిసి కొట్టింది. మహేష్ ఈ సినిమాలో కొత్తగా .. కొత్తగా .. కనిపిస్తాడని ఊరించారు. అది నిజమే మరీ కొత్తగా ఉన్నాడు పాపం. అందుకే ఫ్యాన్స్ కే కళ్ళు తిరుగుతున్నాయి. 

 

ఇక సినిమాను ఓవరాల్ గా చూసిన ప్రేక్షకులకు అక్కడడక్కడా వచ్చే యాక్షన్ సీన్స్ తో పాటు అదోలా ఉన్న రెండు సాంగ్స్ కూడా మాత్రమే పరవాలేదనే విధంగా ఉన్నాయని జనాలు చెప్పుకుంటున్నారు. ఇక క్లైమాక్స్ మాత్రం ఎమోషనల్ గా అందరిని ఆకట్టుకుమ్నేలా ఉందని అంటున్నారు. అయితే పోఇకిరి లెవల్ క్లైమాక్స్ మాత్రం ఆశించవద్దట. మరి అర్థం చేసుకోండి. ఇక ముఖ్యంగా ఈ సినిమాలో ఒక కమర్షియల్ సినిమాకు కావలిసిన ఎలిమెంట్స్ చాలానే ఉన్నాయట. కానీ అసలు లేనిదే కథ అని సూపర్ స్టార్ ఫ్యాన్సే ఫ్రస్టేట్ అవుతున్నారట. ఏమాత్రం లాజిక్ లేకుండా కామెడీ సీన్స్ మీద ఆధారపడి ప్రేక్షకులను బాగా డిసప్పాయింట్ చేశాడని అంటున్నారు. అంతేకాదు అనీల్ సరిలేరు సినిమా విషయంలో శ్రీను వైట్ల ను బాగా ఫాలో అయినట్టు కనిపిస్తుందట. అయితే అందుకు కారణం మాత్రం మహేషే నని అంటున్నారు. ఎందుకంటే ఎప్పుడు సక్సస్ లో ఉన్న డైరెక్టర్ కి ఛాన్స్ ఇవ్వడం ఒక ఫ్లాప్ తెచ్చుకోవడం లా అయిపోయింది మహేష్ పరిస్థితి అని అంటున్నారు. ఆ విషయంలో మహేష్ బాబు మారలేదు అందుకే అప్పుడు ఆగడు ..ఇప్పుడు సరిలేరు ఇంతపెద్ద డిజాస్టర్స్ ..! అంటున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: