సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రష్మిక మందన్నా హీరోయిన్ గా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన సరిలేరు నీకెవ్వరు సినిమా ఈరోజు విడుదలైంది. లేడీ సూపర్ స్టార్ విజయశాంతి 13 సంవత్సరాల తరువాత సరిలేరు నీకెవ్వరు సినిమాతో రీఎంట్రీ ఇచ్చింది. చాలా సంవత్సరాల తరువాత విజయశాంతి ఈ సినిమాతో రీఎంట్రీ ఇవ్వడంతో సినిమాపై భారీగా అంచనాలు పెరిగాయి.
 
ఈ సినిమాలో విజయశాంతి భారతి అనే పేరుతో మెడికల్ కాలేజీలో పనిచేసే ప్రొఫెసర్ పాత్రలో కనిపిస్తుంది. 30 సంవత్సరాల క్రితం మహేష్ బాబు తో కొడుకు దిద్దిన కాపురం సినిమా లో విజయశాంతి నటించింది. అలాగే తెలుగు తెరపై 13 సంవత్సరాల తర్వాత విజయశాంతి రీఎంట్రీ ఇచ్చిన సినిమా కావడంతో ఈ సినిమాలో ఆమె పాత్ర ఎలా ఉంటుంది అని ప్రతి ఒక్కరూ ఎంతో ఆసక్తితో ఎదురు చూశారు. 
 
పైగా సినిమా ప్రమోషన్లలో దర్శకుడు అనిల్ రావిపూడి విజయశాంతిని ప్రత్యేకించి ఈ కథ చెప్పి ఒప్పించడం గురించి అందరూ గొప్పలు చెప్పుకున్నారు. కానీ అసలు ఈ సినిమాకు విజయశాంతి పాత్ర అవసరమా...? విజయశాంతి చేయాల్సినంత ప్రత్యేకత ఏముంది ఆ పాత్రలో అనే సందేహాలు సినిమా చూసిన ప్రేక్షకులకు వ్యక్తమవుతాయి. విజయశాంతి రేంజ్ కు తగిన పాత్రను దర్శకుడు రాసుకోలేదని సినిమా చూసిన ప్రతి ఒక్కరికి స్పష్టంగా తెలిసిపోతుంది. 
 
ప్రకాష్ రాజ్ తో పోటాపోటీగా నటించాల్సిన విజయశాంతి పాత్రను దర్శకుడు సరిగ్గా వాడుకోలేదు. కేవలం మూడు నాలుగు సన్నివేశాలలో మాత్రమే విజయశాంతి పాత్రకు స్కోప్ ఉంది. 13 సంవత్సరాల తరువాత విజయశాంతిని చూడాలనుకున్న అభిమానులను మాత్రం అనిల్ రావిపూడి తీవ్రంగా నిరాశపరిచాడు. సెకండాఫ్ లో విజయశాంతి నటించిన సన్నివేశాలు సినిమాకు ఏ మాత్రం ఉపయోగపడలేదు. ఏదిఏమైనా 13 సంవత్సరాల తరువాత రీఎంట్రీ ఇచ్చిన విజయశాంతి పాత్రకు దర్శకుడు తగిన న్యాయం చేయలేకపోయాడని ప్రేక్షకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: