సరిలేరు నీకెవ్వరు సినిమా ఈరోజు రిలీజ్ అయ్యి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది.  సినిమా అయితే బాగుంది కానీ, కథ పరంగా చూసుకుంటే పెద్దగా ఏమి లేదని పెదవి విరుస్తున్నారు.  అనిల్ రావిపూడి తనలోని రచయితను బటయకు తీసి సీన్స్ మీదనే ఎక్కువగా దృష్టి పెట్టారు.  సీన్స్ ను ఎలివేట్ చేసేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించాయి.  కానీ, కథమీద కూడా కొద్దిగా దృష్టి పెడితే బాగుండేదని అంటున్నారు.  


కామెడీ, మహేష్ బాబు సీన్స్ వర్కౌట్ అయ్యాయి కాబట్టి సరిపోయింది.  లేదంటే ఏ బ్రహ్మోత్సవంలో ఏ స్పైడరో అయ్యేది.  అసలే మహేష్ ఓ మానియా ఉన్నది.  ఒక సినిమా హిట్ తరువాత మరో సినిమా ఫెయిల్ అవుతుంది.  అలాంటిది వరసగా రెండు సినిమాలు హిట్ అయ్యాయి.  మూడో సినిమా ఎలా ఉండబోతుందో అని భయపడ్డారు.  సంక్రాంతికి వచ్చింది కాబట్టి ఏదోలా నిలబడింది అని చెప్పొచ్చు.  


భారీ విజయం అని చెప్పలేము కానీ, సంక్రాంతి సినిమా కాబట్టి కొంతమేర నిలబడటం ఖాయం అని మాత్రం చెప్పొచ్చు.  పైగా సినిమాకు టైమ్ బాండ్ పెట్టుకొని సినిమా చేయడంతో ఇబ్బందులు పడ్డారు అని స్పష్టంగా తెలుస్తోంది.  పక్కాగా ప్లాన్ చేసుకున్నా తక్కువ సమయంలో ఈ బడ్జెట్ తో సినిమాలు తీయడం అంటే కత్తిమీద సాము లాంటిదే.  


ఎలాగైతేనేం సినిమా బయటపడింది.  మంచి టాక్ తో నడుస్తున్నది.  ఇక రేపు రిలీజ్ కాబోతున్న అల వైకుంఠపురంలో సినిమా విజయంపైనే ఈ సినిమా ఆధారపడి ఉంటుంది.  ఆ సినిమా కూడా బాగుంటే ఇండస్ట్రీలో సంక్రాంతికి వచ్చిన మూడు సినిమాలు హిట్ అనే పేరు వస్తుంది.  ఇండస్ట్రీకి మళ్ళీ మంచి రోజులు వచ్చినట్టు అవుతుంది.  అలా కాకుండా తేడా వస్తే ఒక్కటే సినిమా హిట్ అయినట్టుగా ఉంటుంది.  దీంతో పాటుగా ఈనెల 15 వ తేదీన ఎంత మంచివాడవురా సినిమా కూడా రిలీజ్ కాబోతున్నది.  

మరింత సమాచారం తెలుసుకోండి: