నందమూరి కళ్యాణ్ రామ్ ఇప్పటివరకు చేసిన సినిమాల్లో సెంటిమెంట్ ఉన్నా అందులో ఎక్కువగా మాస్ అంశాలు ఉండేలా చూసుకున్నాడు. అందుకేనేమో కళ్యాణ్ రామ్ కు మాస్ ఫాలోయింగ్ పెరిగిందని అనుకోక తప్పదు. ఎందుకంటే కళ్యాణ్ రామ్ చేసిన సినిమాలు మాస్ కేటగిరి ప్రజలకు ఎక్కువగా చేరువయ్యాయి. ఇకపోతే కళ్యాణ్ రామ్ చేసిన చిత్రాలు ఒకేత్తు త్వరలో విడుదల కాబోయే ఎంత మంచివాడవురా సినిమా ఒక ఎత్తు అనే నమ్మకాన్ని కలిగి ఉన్నాడట కళ్యాణ్ రామ్..

 

 

ఎందుకంటే ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న దర్శకుడు గత సంవత్సరం సంక్రాంతికి కూల్ గా వచ్చి విజయాన్ని అందుకున్నాడు. ఇప్పుడు కూడా అదే విధంగా కూల్ గా విడుదలవుతున్న ఎంత మంచివాడవురా చిత్రం కూడా విజయాన్ని నమోదు చేస్తుందనే నమ్మకం కళ్యాణ్ రామ్ లో దర్శకునిలో ఉందట.

 

 

ఇకపోతే ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన దర్శకుడి పేరు సతీష్ వేగేశ్న.. ఇప్పటివరకు సతీష్ వేగేశ్న చేసిన సినిమాలు ఫ్యామిలీ ఆడియెన్స్‌ ను టచ్ చేశాయి. ఇక ఇప్పటికే ఎంత మంచివాడవురా అంటూ టైటిల్‌తోనే ఓ పాజిటివ్ వైబ్స్‌ను క్రియేట్ చేసిన చిత్రయూనిట్.. టీజర్, సాంగ్స్‌తో మంచి అంచనాలను పెంచింది.

 

 

ఇక రాముడు మంచి వాడే.. కానీ రావణ సూరుడిని వేసేయలే.. అనే డైలాగ్‌ను బట్టి ఈ సినిమా పాయింట్ ఏంటో చెప్పకనే చెప్పేసింది చిత్రబృందం. ఇదిలా ఉండగా కళ్యాణ్ రామ్ తాజాగా ప్రముఖ హీరో మరియు కమెడియన్ అలీ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న షో. ఆలీతో సరదాగా లో పాల్గొని ఈ చిత్రం గురించి మూడు ముక్కల్లోచెప్పాడు.

 

 

అదేమంటే తమ తోటి వారికి అవసరమైన సహాయం చేస్తే అంతే చాలనే ట్యాగ్ లైన్ తో స్టోరీ మొత్తం తిరుగుతున్నట్లు పేర్కొన్నారు.. ఇకపోతే సంక్రాంతి కానుకగా ఈ చిత్రం ఈ నెల 15వ తారీఖున విడుదల కాబోతోంది. ఈ ఇందులో కళ్యాణ్ రామ్ సరసన మెహ్రిన్ పిర్జాడ నటించగా సీనియర్ నటుడు విజయ్ కుమార్,  నరేష్, తనికెళ్ల భరణి వంటి వారు ప్రధాన పాత్రలు పోషించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: