అల్లు అర్జున్ కథనాయకుడిగా పూజా హెగ్డే కథనాయకగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా అల.. వైకుంఠపురములో. ఎన్నో అంచనాల నడుమ విడుదల అవుతున్న రేపు విడుదల అవుతుంది. అయితే మన భారత్ లో రేపు విడుదల అయ్యే ఈ  సినిమా యుఎస్ఏలో ప్రీమియర్ షోలు ఆల్రెడీ వేసేశాడు. త్రివిక్రమ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఎలా ఉంది అంటే..?

 

బన్నీ ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి జాబ్ కోసం ట్రై చేసి చేసి ఓ పెద్ద కంపెనీలో జాబ్ కొట్టేస్తాడు. ఆ పెద్ద కంపెనీకి ఓనర్ అయిన పూజ హెగ్డే కి అసిస్టెంట్ బన్నీ. అయితే బన్నీ ఆత్మాభిమానంకు, మంచికి చాలా విలువ ఇచ్చే వ్యక్తి. ఆస్తులు కంటే విలువైంది బంధాలు అని భావిస్తుంటాడు. తను ఆచరిస్తు అందరు ఆచరించేలా చేస్తుంటాడు. ఈ గుణం నచ్చి బన్నీని లవ్ చేస్తుంది పూజ హెగ్డే. 

 

అయితే ఈ సినిమా కూడ సరిలేరు నీకెవ్వరూలనే చాలా కామెడీ ఎంటర్ టైనర్ గా ఉందట. బన్నీ, మురళి శర్మ మధ్య వచ్చే కామెడీ సినిమాకు చాలా హైలైట్. ఇక సెకండాప్ లో అసలు బన్నీ ఎవరు అనేది ట్విస్ట్. ఎంతో ఉత్కంటకు గురి చేస్తుంది. క్లైమాక్స్ లో వచ్చే ఎమోషన ల్ సీన్ చాలా హైలైట్ గా ఉన్నాయట. ఇది అలవైకుంఠపురములో కథ.. 

 

ఈ కథ చూస్తుంటే మీకు ఎం అనిపిస్తుంది.. త్రివిక్రమ్ సినిమాలు అయినా.. జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అత్తారింటికి దారేది, అ ఆ అన్ని సినిమాలు కలిసి ఓ సినిమాల అనిపించటం లేదు.. అన్ని కలిపి ఓక కాపీ పేస్ట్ లా సినిమాను తెరకెక్కించారు అని అక్కడ అభిమానులు అంటున్నారు. త్రివిక్రమ్ సినిమా అంటేనే ఇంకా పంచులు ఉంటాయి.. ఈ పంచులు అన్ని బన్నీ ఫ్యాన్స్ ను అక్కట్టుకొని సినిమాను హిట్ చేస్తారు ఏమో చూడాలి. 

 

కాగా ఈ సినిమాకు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించగా థమన్ సంగీతం అందించాడు. గీత ఆర్ట్స్,  హారిక హాసిని బ్యానర్స్ లో చినబాబు - అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్వహించారు. ఈ సినిమాలో ఒక్క హీరోయిన్ కాదు ఇద్దరు. ఒకరు పూజా హెగ్డే అయితే మరొకరు నివేత పెతు రాజ్. ఇప్పటికే విడుదల టీజర్, ట్రైలర్, మేకింగ్ వీడియోతో అల్లు అర్జున్ అభిమానులు అంత భారీ అంచనాలు పెట్టుకున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: