సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా మహర్షి అంతటి సూపర్ హిట్ సినిమా తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరెకెక్కిన సినిమా సరిలేరు నీకెవ్వరూ. సంక్రాంతి సందర్భంగా ఈ సినిమా నేడు ప్రపంచవ్యాప్తంగా విడుదల అయ్యింది. ఈ సినిమాను చుసిన మహేష్ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. సినిమా అద్భుతంగా ఉంది అంటున్నారు. అలానే కథ కూడా కొంచెమే ఉంది అని కామెంట్లు చేస్తున్నారు.                  

 

అసలు సినిమా చుసిన ప్రేక్షకుల టాక్ ఎలా ఉందంటే.. సినిమా హీరోయిజం అంత కూడా స్టాలిన్ లగే ఉందట. సినిమా సీన్లు అన్ని కూడా స్టాలిన్ లనే ఉన్నాయట. ఏవో డైలాగులతో మాస్ ఫ్యాన్స్ కోసం ఈ సినిమా రూపొందింది అని ప్రేక్షకులు చెప్తున్నారు. అంతేకాదు అంట సినిమాలో సోది కామెడీ ఉందట. సినిమాలో మిలిటరీ ఎపిసోడ్ అసలు బాలేదు అని.. ట్రైన్ సిన్ బాలేదు ఇలా ఏ సీన్లు అంత అద్భుతంగా లేవు అని ప్రేక్షకులు చెప్తున్నారు.  

 

ఇంకా విజయశాంతి పాత్ర కొంచం నడిపించింది అని చెప్తున్నారు ప్రేక్షకులు. అంతేకాదు సినిమా కథ కూడా కాస్త స్టాలిన్ లనే అనిపించిందట. సినిమా హీరోయిజం అచ్చం స్టాలిన్ లో చిరులనే ఉంది అని టాక్. అయినప్పటికీ పండుగా సీజన్ కాబట్టి ప్రేక్షకులు చేసేస్తారు. సినిమా ఎలా ఉన్న సినిమా వసూళ్లు బనే అయితాయి. అంతేకాదు.. పొడుగు మహేష్ కి పొట్టి రష్మిక ఏ మాత్రం సెట్ కాలేదని.. సినిమాలో కెమిస్ట్రీ కూడా ఏమి లేదు అని అంటున్నారు అభిమానులు. కొన్ని కొన్ని పంచులతో థియటర్ లో నవ్వులు పూశాయని చెప్తున్నారు అభిమానులు. కాగా ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించినప్పటికీ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది అని చెప్పచ్చు. 

మరింత సమాచారం తెలుసుకోండి: