ఈ మద్య అన్ని సినిమా పరిశ్రమల్లో బయోపిక్ మూవీస్ వస్తున్న విషయం తెలిసిందే. తెలుగు లో మహానటి,ఎన్టీఆర్ బయోపిక్, యాత్ర రీసెంట్ గా ఉస్మానియా విద్యార్థి నాయకుడు జార్జిరెడ్డి జీవిత కథ ఆధారంగా ‘జార్జిరెడ్డి’ మూవీ వచ్చింది.  ఇక బాలీవుడ్ లో  మేరీ కోమ్, భాగ్ మిల్కా భాగ్, దంగల్, మాంటో ఇలా ఎన్నో బాలీవుడ్ మూవీస్ వచ్చాయి.  చారిత్రాత్మక నేపథ్యంలో కూడా పలు సినిమాలు వచ్చాయి. తాజాగా యాసిడ్ బాధితురాలు లక్ష్మీ అగర్వాల్ జీవిత కథ ఆధారంగా రూపొందిన మూవీ ‘చపాక్’. బాలీవుడ్ ప్రముఖ నటి దీపిక పదుకొనె ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా నేడు రిలీజ్ అయిన విషయం తెలిసిందే. అయితే స్ఫూర్తిని పొందుతూ లైఫ్‌లో ముందుకువెళ్లడానికి ఈ సక్సెస్ స్టోరీస్ పనికొస్తుంటాయి.  

 

మూవీ రిలీజ్ కి ముందు ఇబ్బందులు పడ్డ విషయం తెలిసిందే.  నిజజీవితంలో లక్ష్మీ అగర్వాల్ తరపున కోర్టుల్లో వాదిస్తున్న అడ్వకేట్ అపర్ణ భట్ ఈ చిత్ర యూనిట్ పై పిటిషన్ దాఖలు చేయనున్నట్లు చెప్పారు. లక్ష్మీ అగర్వాల్‌కు క్రెడిట్ ఇవ్వలేదని ఆరోపించారు అపర్ణ భట్. నిజజీవితంలో లక్ష్మీ అగర్వాల్ పోరాడిన తీరు, ఆమెకు న్యాయం జరగడం కోసం వాదించిన అపర్ణ భట్ తన ఫేస్‌బుక్‌లో ఓ పోస్టును పెట్టారు.  ‘చపాక్’ టీం తనకు కనీసం థ్యాంక్స్ కూడా చెప్పలేదని ఆవేదన వ్యక్తం చేసిన భట్.. బాలీవుడ్ నిర్మాతలతో తలపడేంత శక్తి తనకు లేదన్నారు. మొత్తానికి నేడు 'ఛపాక్' మూవీ రిలీజ్ అయ్యింది.  కానీ థియేటర్ టాక్ మాత్రం దారుణంగా వచ్చింది. ఎన్నో అంచనాలతో విడుదలైన ఈ చిత్రం నిరాశను మిగిల్చింది.

 

తొలిరోజు కేవలం రూ 4.77 కోట్ల వసూళ్లను మాత్రమే రాబట్టి డిజాస్టర్ గా నిలిచింది.  సాధారణంగా దీపికా పడుకొనె మూవీస్ కి ఎంతో క్రేజ్ ఉంటుంది. కానీ ఈ మూవికి ఆమె క్రేజ్ ఏమాత్రం పనికి రాలేదనిపిస్తుంది. బాలీవుడ్ ట్రేడ్ అనలిస్ట్ స్పందిస్తూ, హైఎండ్ మల్టీప్లెక్సుల్లో మాత్రమే ఈ మూవీ కొంతమేర రాణించిందని చెప్పారు. వారాంతం నేపథ్యంలో వసూళ్లు కొంతమేర పెరిగే అవకాశం ఉండవచ్చని తెలిపారు.మాస్ ప్రేక్షకులను ఈ మూవీ ఆకట్టుకోలేకపోయిందని చెప్పారు. ఈ మూవీలో దీపిక ప్రధాన పాత్రను పోషించడమే కాకుండా... తొలిసారి నిర్మాతగా కూడా వ్యవహరించింది.  మొత్తానికి ఈ మూతో నిర్మాతగా, నటిగా రెండు రకాలుగా నష్టపోయిందని బాలీవుడ్ వర్గాల్లో టాక్ నడుస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: