సంక్రాంతి పండుగ అనేది అనిల్ రావిపూడి సక్సెస్ కు కేరాఫ్ గా నిలిచిందన్న విషయం మరో సారి నిరూపించారు.ఈ సంక్రాంతికి మహేష్ బాబు తో సరిలేరు నీకెవ్వరు చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమాలో మహేష్ బాబుకు జోడీగా రష్మీక మందాన్న నటించారు.. విజయశాంతి, ప్రకాష్ రాజ్, రాజేంద్రప్రసాద్ లు కీలక పాత్రల్లో నటించారు..


ఇకపోతే ప్రతి సినిమాలో రొమాన్స్ కు కేరాఫ్ గా ఉన్న మహేష్ కు ఈ సినిమాలో యూత్ ను ఆకట్టుకునేలా సీన్లు లేవని టాక్ వినపడుతుంది.. మిలటరీ వ్యక్తి పాత్రలో నటించిన మహేష్ ను చూస్తే మహర్షి, శ్రీమంతుడు సినిమాలు గుర్తుకు వస్తున్నాయి అంటున్నారు.మహేష్ అన్నీ సినిమాలను కలబోసి ఈ సినిమా మీద ఎఫోర్ట్ పెట్టిన పెద్దగా కలిసిరాలేదు.. దీంతో సినిమాకు గడ్డుకాలం ఏర్పడింది..


 ఈ సినిమాకు భారీ అంచనాలే నెలకొన్నాయి.అయితే సినిమాలో హీరో హీరోయిన్లు మద్య సాగే సన్నవేశాలు సినిమాను హిట్ టాక్ ను అందుకునేలా లేదని మహేష్ యాంటీ ఫ్యాన్స్ అంటున్నారు.. సినీ వర్గాల విషయానికొస్తే.. సినిమా రొటీన్ కథనే తీశారు..మహేష్ సినిమాలో ఉన్న జోష్ ఈ సినిమాలో లేకపోవడంతో ఈ సినిమా హిట్ కాలేకపోయింది.. అనిల్ జిమ్మిక్కులు కేవలం ఫస్ట్ ఆఫ్ కే సెట్ అయ్యాయని అంటున్నారు.. సెకండ్ ఆఫ్ సాగదీయడం ఈ సినిమా కలెక్షన్లు గండి పడిందని టాక్..

 

  ప్రస్తుతం మాత్రం మహేష్ ఫ్యాన్స్ కు కావాల్సిన అన్ని ఎలిమెంట్స్ అన్ని మిస్ చెయ్యకుండా దర్శకుడు అనీల్ అదరగొట్టారని చెప్పాలి.  కామెడీ ట్రాక్స్ అదిరిపోయేలా రావడమే కాకుండా పర్ఫెక్ట్ ఇంటర్వెల్ బ్యాంగ్ ఎపిసోడ్ తో థియేటర్స్ దద్దరిల్లడం ఖాయం. ఈ సినిమాలో గ‌తంలో లేన‌ట్టుగా స‌రికొత్త స్టెప్పులు వేశాడు. తమన్నాతో ప్లాన్ చేసిన పార్టీ సాంగ్ లో మహేష్ వేసిన స్టెప్పులకు అయితే ఓ సరికొత్త మహేష్ ను చూడొచ్చు. ఇక ర‌ష్మిక‌తో చివ‌రి సాంగ్ మైండ్ బ్లాకు.. మాస్ లుక్కు బాగుంది మైండు బ్లాకు సాంగులో ఇద్ద‌రూ క‌లిసి పోటాపోటీగా స్టెప్పులు వేశారు. ఐతే ఈ సినిమా ప్రస్తుతానికి సూపర్ హిట్ టాక్ అందుకుంది. మరో వైపు  మహేష్ ఈ సినిమా కోసం బాగా తగ్గాడని గుసగుసలు వినపడుతున్నాయి..

మరింత సమాచారం తెలుసుకోండి: