సూపర్ స్టార్ రజినీకాంత్ పేరు పరిచయం అక్కరలేని పేరు.. తెలుగు, తమిళ్ చిత్రాల్లో నటించి మంచి పేరును తెచ్చుకున్న హీరో.. 168 కి పైగా సినిమాలలో నటించారు ఘనత ఒక్క రజినీ కాంత్ కే సొంతం..ఆయన కున్న క్రేజ్ వల్లే ఇన్ని రోజులు సినిమాలలో రాణిస్తున్నారు..అందుకే తెలుగు, తమిళ్ లో ఆయనకు అభిమానులు ఎక్కువే అని అందరికీ తెలిసిందే..

 

గతంలో వచ్చిన పేట సినిమా తెలుగులో హిట్ కాకపోయిన కూడా తమిళ్ మాత్రం హిట్ అయింది.. దీంతో మరింతగా అభిమానులు పెరిగారు.. అదే సినిమా పవర్ అంటే అని అందరికీ తెలిసిన విషయమే..ప్రస్తుతం రజినీకాంత్ నటించిన దర్బార్ చిత్రం లో నటించారు.. మురగదాస్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది..లేడీ బాస్ నయనతార సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది..

 

60 సంవత్సరాలు దాటిన కూడా రజినీ పవర్ లో ఈ మాత్రం డోకా లేదని అర్థమవుతుంది..సినిమాలా హిట్ పక్కన పెడితే సినిమాల జోరు మాత్రం మరింత పెరిగింది.. ఒక్కో సినిమా ప్రేక్షకుల ముందుకొస్తుంది.. దానితో పాటుగా అమితమైన అభిమానులు కూడా పెరుగుతూ వస్తున్నారు..అందుకే సినిమా ఎలా ఉన్నా కూడా సినిమాలు మాత్రం హిట్ అవుతున్నాయి..

 


అయితే సినిమా కలెక్షన్స్  రూ. 50 కోట్ల వరకు వసూళ్లు సాధించిన రజిని దర్బార్, రెండో రోజు కూడా అదే హవాను కొనసాగించింది.  రెండు రోజుల్లో ఈ సినిమా రూ. 100 కోట్లు క్రాస్ చేసింది.  మొదటి రోజుకంటే రెండో రోజే వసూళ్లు అధికంగా ఉన్నాయట.  ఇక పండగ సీజన్ కావడంతో రజిని దర్బార్ భారీ వసూళ్లు సాధించే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఈ సినిమాకు ఏ సినిమా పోటీ లేకపోవడంతో ఈ సినిమాకు బాగానే కలిసి వచ్చింది. మొత్తానికి సినిమా హిట్ అవ్వడంతో తలైవా ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: