మరి కొన్ని గంటలలో ‘అల వైకుంఠపురములో’ మూవీ పై సగటు ప్రేక్షకుడి తీర్పు రాబోతున్న పరిస్థితులలో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రేక్షకుల తీరు పై చేసిన కామెంట్స్ అత్యంత ఆశ్చర్యంగా మారాయి. ప్రేక్షకులు ఏ సినిమాని హిట్టు చేస్తారో ఏ సినిమాని ఫ్లాప్ చేస్తారో ఎవరూ ఊహించలేని విషయం అని చెపుతూ అసలు ఆడియెన్ పల్స్ పట్టుకునేందుకు ఏదైనా ఒక మీటర్ ఉంటే బాగుంటుంది అంటూ త్రివిక్రమ్ కామెంట్ చేసాడు. 

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్అభిప్రాయంలో ఒక సినిమాను ప్రేక్షకులు తిరస్కరించారు అంటే తాను చేసిన పని ప్రేక్షకులకు నచ్చలేదు అన్న విషయం స్పష్టంగా తనకు అర్ధం అవుతుందనీ అంటూ `ప్రేక్షకులనేవాళ్లు నిష్పక్షపాతంగా వ్యవహరిస్తారు. అందుకే వాళ్లను ప్రేక్షక దేవుళ్లు అంటుంటాం. థియేటర్లో లైట్లు ఆర్పిన తర్వాత కులం- మతం- జాతి.. వీటన్నిటికీ అతీతంగా సినిమాని చూస్తారు. వాళ్లను ఏదీ ఆ టైంలో ప్రభావితం చేయదు. నవ్వొస్తే నవ్వుతారు.. ఆనందం వస్తే ఆనందిస్తారు. కళ్లల్లో నీళ్లొస్తే ఏడుస్తారు’ అంటూ ప్రేక్షకుల మనస్తత్వం పై తన అభిప్రాయాన్ని చాల తెలివిగా క్లారిటీగా తెలియ చేసాడు. 

త్రివిక్రమ్ మాటలలో తాత్వికత కనిపిస్తున్నా రేపు విడుదల కాబోతున్న తన సినిమా రిలీజ్ టైమ్ లో త్రివిక్రమ్ కు ఇంతటి వేదాంతం ఎందుకు వచ్చిందో ఎవరికీ అర్థం కాని విషయంగా మారింది. కొన్ని వేల పుస్తకాలు చదివి కొన్ని వందలమంది మనస్తత్వాలను గ్రహించిన త్రివిక్రమ్ కు కూడ సగటు ప్రేక్షకుడి నాడి తెలియడం లేదు అంటే నేటి యువతరం డైరెక్టర్లు తాము తీసే సినిమాలలో ఎలాంటి తప్పులు చేయకుండా జాగ్రత్తలు ఎలా తీసుకోవాలో అర్థమవుతుంది. ఏది ఏమైనా త్రివిక్రమ్ వేదాంతం ‘అల వైకుంఠములో’ రిలీజ్ టైమ్ లో బయటపడటంతో ఈ మూవీ బయ్యర్లు భయపడుతూ త్రివిక్రమ్ మాటలలోని అర్ధాలను విశ్లేషిస్తూ తెగ టెన్షన్ ఫీల్ అవుతున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: