అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న అల వైకుంఠపురములో సినిమా రేపు విడుదలవుతోంది. అల్లు అర్జున్సినిమా ప్రమోషన్లలో పాల్గొంటూ మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. అల్లు అర్జున్ ఇప్పటికే సంక్రాంతికి విడుదల కానున్న ఇతర సినిమాలకు కూడా ఆల్ ది బెస్ట్ చెప్పిన విషయం తెలిసిందే. ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న అల్లు అర్జున్ ను మహేష్ బాబు వ్యాఖ్యల గురించి స్పందించమని ప్రశ్నించగా మహేష్ చేసిన వ్యాఖ్యల గురించి అల్లు అర్జున్ స్పందించాడు. 
 
మహేష్ బాబు కొన్ని రోజుల క్రితం స్టార్ హీరోలు ప్రయోగాలు చేయకపోవడానికి కొన్ని కారణాలు ఉన్నాయని భారీ బడ్జెట్లతో స్టార్ హీరోల సినిమాలు తెరకెక్కుతున్నాయని ప్రయోగాలు చేయకపోవటానికి ఇదే అసలు కారణమని చెప్పారు. స్టార్ హీరోలు నిర్మాతలు నష్టాల బారిన పడకూడదనే ఆలోచనతో ప్రయోగాలకు వెనుకాడుతున్నారని అన్నారు. అల్లు అర్జున్ కూడా మహేష్ బాబు చేసిన వ్యాఖ్యలు నిజమేనని అభిప్రాయం వ్యక్తం చేశారు. 
 
చాలా సంవత్సరాలు కష్టపడితే మాత్రమే స్టార్ హీరోలకు భారీ మార్కెట్ వస్తుందని అల్లు అర్జున్ అన్నారు. 100 కోట్ల రూపాయల మార్కెట్ ఉన్న హీరోలు ప్రయోగాల పేరుతో తక్కువ బడ్జెట్ సినిమాల్లో నటించడం అనవసరం అని అన్నారు. స్టార్ హీరోలు చిన్న బడ్జెట్ సినిమాల్లో నటించడం వీలు కాదని ప్రయోగాలు చేసినా తమ స్థాయికి తగిన విధంగానే ప్రయోగాలు చేయాలని అన్నారు. 
 
స్టార్ హీరోలు తక్కువ బడ్జెట్ సినిమాల్లో నటిస్తే సినిమా క్వాలిటీ తగ్గటంతో పాటు అభిమానుల నుండి, విమర్శకుల నుండి కూడా విమర్శలు వ్యక్తమయ్యే అవకాశం ఉంది. సంక్రాంతి పండుగ సందర్భంగా ఇప్పటికే దర్బార్, సరిలేరు నీకెవ్వరు సినిమాలు విడుదల కాగా దర్బార్ కు యావరేజ్ టాక్, సరిలేరు నీకెవ్వరు సినిమాకు హిట్ టాక్ వినిపిస్తోంది. రేపు విడుదల కాబోతున్న అల వైకుంఠపురములో సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాల్సి ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: