టాలీవుడ్ లో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అంటే ప్రత్యేక పేరు ఉంటుందన్న విషయం తెలిసిందే.  ఆయన ఇప్పటి వరకు తీసిన సినిమాలు ఒకటీ రెండు తప్ప అన్ని మంచి విజయాలు సాధించవే.  అయితే ఆ మద్య పవన్ కళ్యాన్ తో తీసిన అజ్ఞాత వాసి మూవీ స్టోరీ లైన్ బాగున్న ఎక్కడో దెబ్బతినడం వల్ల మూవీ అట్టర్ ఫ్లాప్ అయ్యింది. తాజాగా అల్లు అర్జున్ తో త్రివిక్రమ్ ‘అల వైకుంఠపురములో’ మూవీ తెరకెక్కించిన విషయం తెలిసిందే.  ఈ మూవీ రేపు ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది. ఈ మూవి ప్రమోషన్ బిజీలో చిత్ర యూనిట్ ఉన్నారు.  ఇప్పటికే అల్లు అర్జున్ అన్ని ఛానల్స్ లో బిజీగా ఉన్నారు. 

 

మూవీ గురించిన విషయాలు తెలుపుతున్నారు.  తాజాగా  చిత్ర ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ‘పోతనగారి పద్యం ‘అల వైకుంఠపురంలో.. నగరిలో.. ఆ మూల.. ’. అలాంటి ప్లేస్ ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుందో ఆయన ఆ పద్యంలో చెప్పారు. మానవ సంబంధాలున్న ప్రదేశాలన్నీ అందంగానే ఉంటాయి. అలాంటి హ్యూమన్ రిలేషన్స్, ఎమోషన్స్ ఉన్న సినిమా ఇది అంటున్నారు త్రివిక్రమ్. ఈ మూవీ టైటిల్ ఎందుకు పెట్టామో సినిమా చూస్తే అర్థం అవుతుందని.. అల.. వైకుంఠపురంలో అనే టైటిల్ ఈ మూవీకి సముచితమనిపించిందని చెప్పారు.

 

గతంలో త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన ‘జులాయి’ ఓ యువకుడు తన తెలివితేటలతో విలన్ల ఆట ఎలా కట్టించాడు అని తెలిపితే.. సన్నాఫ్ సత్యమూర్తి మూవీలో తండ్రి విలువ ఎంత గొప్పదో.. పిల్లల కోసం తండ్రి ఎంత త్యాగం చేస్తారో అని కుటుంబం విలువ గురించి తండ్రి కొడుకు ఎమోషన్స్ గురించి చూపించారు.  తాజాగా రిలీజ్ కాబోతున్న ‘అల వైకుంఠపురములో’ మూవీలో అన్ని వర్గాలను ఆకట్టుకునే విధంగా హాయిగా నవ్వుకునే సినిమా అని అంటున్నారు దర్శకులు త్రివిక్రమ్. 

మరింత సమాచారం తెలుసుకోండి: