ప్రభాస్‌ క్రేజ్‌ బాహుబలి, సాహో చిత్రాల తర్వాత  ఖండాంతరాలు దాటింది.ఈ రెబల్‌ స్టార్‌కు  హాలీవుడ్‌ హీరో రేంజ్‌ ఫ్యాన్స్‌ ఫాలోయింగ్‌  ఏర్పడింది. అయితే ప్రభాస్‌ హీరోగా  ‘సాహో’తర్వాత ‘జిల్‌’ఫేం రాధాకృష్ణ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.ఈ చిత్రం రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ జానర్‌లో, ఇటలీ బ్యాక్‌డ్రాప్‌లో  తెరకెక్కుతుందని సమాచారం. ఈ చిత్రం 'జాన్' అనే వర్కింగ్ టైటిల్​తో  షూటింగ్ జరుపుకొంటోంది. అయితే వర్కింగ్‌ టైటిల్‌నే సినిమా టైటిల్‌గా డిసైడ్‌ అయినట్లు కూడా అప్పట్లో వార్తలు వచ్చాయి. ఈ అయితే మూవీ టైటిల్​ను  ఇప్పుడు  మార్చాలని చూస్తోందట ఈ చిత్రబృందం.


ఇప్పటికే   జనాల్లోకి వెళ్లిపోయిన ఈ టైటిల్‌తో వెళితే సినీ అభిమానుల్లో అంత హైప్‌ క్రియేట్‌ అవదని చిత్ర యూనిట్‌ భావించిందట.అంతే కాదు మరిన్ని అంచనాలు   ఈ సినిమాపై అభిమానుల్లో పెంచడానికి మరో డిఫరెంట్‌ టైటిల్‌ కోసం కూడా ఈ చిత్ర బృందం ఇప్పటికే అన్వేషణ మొదలుపెట్టిందట. ఇందుకోసం ప్రభాస్‌ అభిమానుల నుంచి కూడా కొన్ని సలహాలు తీసుకోనుందని సమాచారం.

 

అయితే ప్రభాస్‌ కొత్త సినిమా పేరు ‘జాన్‌’ కాదని తెలియడంతో దిల్‌ రాజు తన సినిమా విషయంలో నిర్భయంగా ముందడుగేశాడు. తమిళ సూపర్‌ డూపర్‌ హిట్‌ చిత్రం ‘96’ను దిల్‌ రాజు తెలుగులో రిమేక్‌ చేస్తున్న విషయం తెలిసిందే. 


అయితే ఈ చిత్రం ప్రారంభం నుంచి తన చిత్రానికి ‘జాను’అనే టైటిల్‌ను పెట్టాలని ఆలోచించాడట. కానీ ప్రభాస్‌ ‘జాన్‌’ తో దగ్గరి పోలికలు ఉండటంతో ఈ అగ్ర నిర్మాత కాస్త తటపటాయించాడట. అందుకే నిర్మాణం పూర్తయ్యే వరకు కూడా చిత్ర టైటిల్‌ను డిసైడ్‌ చేయలేకపోయాడు దిల్‌ రాజు. తాజాగా అతడికి అందిన సమాచారం ప్రకారం రాధాకృష్ణ టీం ఆ టైటిల్‌ను వదులుకున్నట్లు తెలియడంతో వెంటనే తన చిత్రానికి ‘జాను’ అనే టైటిల్‌ ఫిక్స్‌ చేసి వెంటనే ఫస్ట్‌లుక్‌, టీజర్‌ను విడుదల చేసినట్లు సమాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: