టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ సరిలేరు నీకెవ్వరు ప్రపంచవ్యాప్తంగా ఎంతో గ్రాండ్ లెవెల్లో రిలీజ్ అయిన  విషయం తెలిసిందే. మహేష్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందించగా, అనిల్ రావి పూడి తన కమర్షియల్ హంగులతో ఈ సినిమా ని నింపేశాడు. తమ హీరో మహేశ్ బాబు ని ఎవ్వరూ చూపించలేని రీతిలో అనిల్ చూపించాడు అంటూ అతనిమీద ఫాన్స్ ఫుల్ ఖుషీ గా ఉన్నారు. ట్విటర్ లో అనిల్ కి ప్రశంసల జల్లు మొదలైంది .

 

 

మహేశ్ బాబు ని ఇంత మాస్ అవతారం లో చూసి చాలా సంవత్సరాలు అయ్యింది అని థాంక్స్ చెబుతున్నారు అందరూ . ఈ సినిమా కలక్షన్ రిజల్ట్ ఇంకా రావాల్సి ఉంది .. సీడెడ్ లో గ్రాస్ కలక్షన్ దాదాపు నాలుగున్నర కోట్లు పైనే ఉంటుంది అని ఫాన్స్ అనుకుంటున్నారు . ఆంధ్రా తెలంగాణ కలిపి ముప్పై ఆరు కోట్ల వరకూ షేర్ కలక్షన్ రావచ్చు అనే డిస్కషన్ లు జరుగుతున్నాయి. అనిల్ రావిపూడి ఈ సినిమా లో పూర్తిగా మాస్ ఏలేవేషన్  లు పెట్టేశాడు .

 

 

ఎక్కడ లోటు లేకుండా ఫాన్స్ కి ఫుల్ మీల్స్ ఇచ్చాడు . మైండ్ బ్లాక్ సాంగ్ అయితే థియేటర్ లో  ఒక ఊపు ఊపేసింది. అలాంటి కంటెంట్ ఉంటే సంక్రాంతి సినిమా లు విపరీతంగా ఆడేస్తాయి. పైగా పాటలు , ట్రెయిలర్ మొదటి నుంచీ పాజిటివ్ ఇంపాక్ట్ ఇవ్వడం తో మొదటి రోజు సరిలేరు షేర్ కలక్షన్ అద్దిరిపోతుంది అనీ బొమ్మ బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా దద్దరిల్లిపోద్ది అని అంటున్నారు విశ్లేషకులు .  అఫీషియల్ నెంబర్ వచ్చే వరకూ చూడాలి . 

 

మరింత సమాచారం తెలుసుకోండి: