సంక్రాంతి నాడు పెద్ద సినిమాలు బాక్సాఫీస్ వద్ద తలపడితే ఆ మజానే వేరు. అందులోనూ పెద్ద హీరో సినిమా వచ్చిందంటే సినీ ప్రేక్షకులకు అసలు సిసలు పెద్ద పండుగే.  సూపర్ స్టార్ మహేష్ బాబు సంక్రాంతి బరిలో బాక్సాఫీస్ దుమ్ముదులపడంలో ‘బేరాల్లేవమ్మా’.. అంటూ ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంతో థియేటర్స్‌లో ఎంట్రీ ఇచ్చేశారు.

 

 మహేష్  ‘బొమ్మ దద్దరిల్లిపోద్ది.. సినిమా మీద చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నా.. సినిమా మొదలైన రోజునుండి ఇప్పటిదాకా ఇదే వైబ్‌ని ఫీల్ అవుతున్నా. బ్లాక్ బస్టర్ రాబోతుందని ముందుగా తెలిసినప్పుడే ఇలా జరుగుతుంది’ అన్న ఆయన నమ్మకం వమ్ము కాలేదు. అన్నట్టుగానే సంక్రాంతి పూట బ్లాక్ బస్టర్ బొమ్మ చూపించారు. ఈ చిత్ర కథ విషయానికి వస్తే...ఈ చిత్రంలో విజయశాంతి కర్నూల్ మెడికల్ కాలేజ్ ప్రొఫెసర్. భర్తను కోల్పోయిన ఆమె తన ఇద్దరు కొడుకుల్ని ఆర్మీకి పంపిస్తుంది. పెద్ద కొడుకు చనిపోగా.. చిన్నకొడుకు  సత్య రాజ్ కాశ్మీర్‌లో జవాన్‌గా పనిచేస్తాడు.  ఓ రెస్క్యూ ఆపరేషన్ మేజర్ అజయ్ క్రిష్ణగా  మహేష్ బాబు ఉగ్రవాదుల మట్టుపెట్టేందుకు   నిర్వహిస్తాడు.

 

భారతి కొడుకు అజయ్ ఆ ఆపరేషన్‌లో  చనిపోతాడు. అదే సందర్భంలో భారతి ఓ కేసు విషయంలో కర్నూల్ మంత్రి నాగేంద్ర (ప్రకాష్ రాజ్)‌ని ఎదురిస్తుంది. భారతి కుటుంబాన్ని చంపేందుకు నాగేంద్ర ప్రయత్నిస్తుండటంతో ప్రమాదంలో ఉన్న భారతి కుటుంబాన్ని రక్షించేందుకు అనూహ్య పరిస్థితుల మధ్య కర్నూల్‌కి వస్తాడు అజయ్ క్రిష్ణ. అసలు భారతి కుటుంబానికి వచ్చిన ఇబ్బంది ఏంటి? దాన్ని అజయ్ క్రిష్ణ ఇలా పరిష్కరించాడు. బార్డర్‌లో గస్తీ కాయాల్సిన మేజర్ అజయ్.. భారతి కుటుంబాన్ని గస్తీ కాయడానికి గల కారణాలు ఏంటి? హీరోయిన్ రష్మిక (సంస్కృతి) ఈ మేజర్ కథలోకి ఎలా వచ్చిందన్నది తెరపై చూడాల్సిందే.

 

 

వరుసగా దర్శకుడిగా అనీల్  నాలుగు హిట్లు, హీరోగా మహేష్‌కి రెండు హిట్లు ఉండటంతో ఈ ఇద్దరి కాంబినేషన్‌లో మూవీ అంటే ప్రేక్షకుల్లో ఒకరకమైన ధీమా ఉంటుంది. అందులోని అనీల్ రావిపూడి సినిమా అంటే ఎంటర్‌‌టైన్మెంట్ పక్కా. ఎలాగూ ప్రామిసింగ్ ప్రాజెక్ట్ కాబట్టి కమర్షియల్ అంశాలను చాలా బ్యాలెన్సింగ్‌ చేస్తూ.. కాలక్షేపానికి కథ అన్నట్టుగా కాకుండా కన్వెన్సింగ్‌గానే వర్కౌట్ చేశాడు దర్శకుడు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: