మాటల మాంత్రీలుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పూజా హెగ్డే జంటగా  తెరకెక్కిన సినిమా 'అల వైకుంఠపురములో'. ఈ సినిమా ఏంటో..ఎలా ఉందో ఇంకొన్ని గంటలలో ప్రేక్షకులు డిసైడ్ చేయబోతున్నారు. అయితే ఈ నేపథ్యంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎప్పుడూ లేనట్టుగా ప్రేక్షకుల తీర్పు పై మాటల మాంత్రీకుడు చేసిన కామెంట్స్ ఇప్పుడు అంతటా హాట్ టాపిక్ గా మారాయి. ప్రేక్షకులు ఏ సినిమాని హిట్టు చేస్తారో ఏ సినిమాని ఫ్లాప్ చేస్తారో ఎవరూ ఊహించలేని విషయం అని చెపుతూ అసలు ఆడియెన్ పల్స్ పట్టుకోవడానికి ఏదైనా ఒక మీటర్ ఉంటే బాగుంటుందని త్రివిక్రమ్ అన్నారు. 

 

మాటల మాంత్రికుడు మేము తీసిన ఒక సినిమాను ప్రేక్షకులు రిజక్ట్ చేశారంటే మేము తీసిన సినిమా ప్రేక్షకులకు నచ్చలేదన్న విషయం మాకు వెంటనే అర్థమైపోతుందని అన్నారు. ఈ విషయంలో మేము ఎన్ని కోట్లు ఖర్చు పెట్టి గొప్పగా సినిమా తీసినప్పటికి 'ప్రేక్షకులనేవాళ్లు నిష్పక్షపాతంగా వ్యవహరిస్తారు. అందుకే వాళ్లను ప్రేక్షక దేవుళ్లు అంటాం అన్నారు. అంతేకాదు ఒక్కసారి థియేటర్లో లైట్లు ఆర్పి సినిమా మొదలైన తర్వాత కులం- మతం- జాతి.. వంటి వాటికి అతీతంగా సినిమాని చూస్తారు. ఆ టైంలో వాళ్ళను ఏ అంశం గట్టిగా ప్రభావితం చేయదు. నవ్వొస్తే నవ్వుతారు.. ఆనందం వస్తే ఆనందిస్తారు. కళ్లల్లో నీళ్లొస్తే ఏడుస్తారు’ అంటూ ప్రేక్షకుల రియాక్షన్ మీద ఆయన అభిప్రాయాన్ని సింపుల్ లాజిక్ తో చెప్పారు. 

 

దీన్ని బట్టి చూస్తుంటే త్రివిక్రమ్ మాటలలో తాత్వికత కనిపిస్తుంది. రేపు రిలీజ్ అవబోతున్న అల సినిమా విషయంలో ఇప్పుడు త్రివిక్రమ్ కు ఇంత వేదాంతం ఎందుకు మాట్లాడుతున్నారో ఎవరికీ అర్థం కావడం లేదు. ఇప్పటికే కొన్ని వేల పుస్తకాలు చదివి కొన్ని వందల సినిమాలను చూసిన త్రివిక్రమ్ కు కూడ సగటు ప్రేక్షకుడి నాడి పట్టుకొని సినిమా ఎలా తీయాలో తెలియడం లేదంటే ఇక ఇప్పుడొస్తున్న కొత్త దర్శకుల పరిస్థితేంటి ..? ఇక మన మాటల మాంత్రీకుడు ఇలా మాట్లాడుతున్నారంటే సినిమా ఏదో తెడా కొడుతుందనేనా అర్థం. ఏదేమైనా ఇంకొన్ని గంటల్లో ఆయన మాటలకు అర్థం ఏంటో తెలిసిపోతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: