మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా అల వైకుంఠపురములో. త్రివిక్రమ్ శ్రీనివాస్సినిమా చేసినా ఆ సినిమా దాదాపుగా హిట్ అవుతుంది. నెటిజన్లు కూడా ఏ డౌటనుమానం అవసరమే లేదు ఈసారి అల వైకుంఠపురములో సినిమా సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదలైన అన్ని సినిమాలలో కంటే సూపర్ దూసుకుపోతుందని కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఇప్పటికే ఈ సినిమా పాటలకు చాలా ఆదరణ ప్రేక్షకుల నుంచి వచ్చింది. ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమా ఎలా ఉంటుందనేది తెలుసుకోవాలంటే రేపటి వరకు వేచి చూడాల్సిందే.


సోషల్ మీడియాలో ప్రస్తుతం అల వైకుంఠపురములో చిత్రం హిట్ కావాలని చాలా మంది ఆశిస్తున్నారు. అయితే ఈ సినిమాలో త్రివిక్రమ్ శ్రీనివాస్ యొక్క మాటలు మాత్రమే హైలెట్ అవ్వనున్నాయా? పాటలు ఎలాగో హిట్టయ్యాయి. కానీ కథ తెలుగు ప్రేక్షకులకు ఎలా నచ్చుతుందో చెప్పలేనటువంటి పరిస్థితి. సీనియర్ నటి టబు, రాజేంద్ర ప్రసాద్ ఈ సినిమాకి ప్లస్ పాయింట్స్ గా చెప్పుకోవచ్చు. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎక్కువగా కథానాయకులతోనే కామెడీ పండిస్తారు. ఈ సినిమాలో కూడా అదే స్పష్టమౌతుంది. ఇకపోతే సునీల్, వెన్నెల కిషోర్ కూడా ఈ చిత్రంలో నవ్వులు పూయించనున్నారని చెప్పుకోవచ్చు. ఫైట్లు గట్రా కొంచెం అతిగానే ఉన్నాయనుకోండి.. డాన్సులు మాత్రం సూపర్ గా ఉన్నాయని గతంలో విడుదలైన పాటలను చూస్తే అర్థమవుతుంది. నాలుగు రోజుల క్రితం విడుదలైన ట్రైలర్ 'పులి వచ్చిందే మేక చచ్చిందే' అనే డైలాగ్ తో ముగుస్తుంది. మరి అల వైకుంఠపురములో చిత్రం పులా లేకపోతే మేకా అనేది తెలియనున్నది.


ఇంతవరకు ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్, టీజర్ గాని, సినిమా పాటలు గానీ చూస్తే పూజా హెగ్డే నిజంగానే చాలా బాగుందని నిస్సందేహంగా చెప్పుకోవచ్చు. తమన్ మాత్రం అసలు మ్యూజిక్ తో తెలుగు ప్రేక్షక అభిమానుల మనస్సుల్ని దోచేశారు. బుట్టబొమ్మ సాంగ్ కోసమేనా ఈ సినిమా కి వెళ్లొచ్చని లక్షల మంది అభిప్రాయపడుతున్నారు. చివరికి ఏం చెప్పాలి అనుకున్నామంటే.. ఈ చిత్రం మ్యూజికల్ హిట్ అనే టాక్ ని ఆల్రెడీ సంపాదించింది కాబట్టి ఈసారి సంక్రాంతికి విడుదలైన సినిమాలలో బన్నీదే హావ అని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: