మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ ద‌ర్శ‌క‌త్వంలో స్టైలిష్‌స్టార్ అల్లుఅర్జున్‌, పూజాహెగ్డే హీరో హీరోయిన్లుగా న‌టిస్తున్న చిత్రం `అల‌వైకుంఠ‌పురంలో`ఈ సినిమాని  హారిక అండ్ హాసిని క్రియేషన్స్ ,గీతా ఆర్ట్స్  పతాకాలపై అల్లు అరవింద్, ఎస్. రాధాకృష్ణ సంయుక్తంగా నిర్మించారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ సినిమా విడుదలవుతుంది.

 

చాలా గ్యాప్ త‌ర్వాత వ‌స్తున్న అల్లుఅర్జున్ చిత్రం కోసం ఫ్యాన్స్ చాలా ఆత్రుత‌గా ఎదురు చూస్తున్నారు. అందులోనూ అల్లుఅర్జున్ హిట్ కొట్టి చాలా కాలం కావ‌డంతో అంద‌రూ ఈ సినిమా కోసం ఎప్పుడెప్పుడా అని బ‌న్నీ ఫ్యాన్స్ మాత్ర‌మే కాక సినీ ప్రేక్ష‌కులంద‌రూ ఎదురు చూస్తున్నారు. బ‌న్నీ గ‌త చిత్రాలు `డీజె` ప‌ర్వాలేద‌నిపించుకున్నా.. `నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా` చిత్రం అట్ట‌ర్ ఫ్లాప్ అయింది. అయితే దీంతో ఈ చిత్రం ఎక్క‌డ తేడా కొడుతుందో అని ఓ ప‌క్క ఫ్యాన్స్ గుండెల్లో అప్పుడే గుబులు మొద‌లైంది. ఇప్ప‌టికే విడుద‌లైన ఈ చిత్ర ఆడియో సూప‌ర్ డూప‌ర్ హిట్ అయింది. 

 

కాబ‌ట్టి సినిమా పై మంచి అంచ‌నాలే నెల‌కొన్నాయి.  ఏమాత్రం సినిమా తేడా కొట్టేసినా బ‌న్నీ ఖాతాలోకి హ్యాట్రిక్ ఫ్లాపులు వ‌చ్చేస్తాయి. మ‌రి త్రివిక్ర‌మ్ బ‌న్నీని గ‌ట్టెక్కిస్తాడో లేదో వేచి చూడాలి. ఇక  అదే చిత్రం హిట్ కొట్టిదంటే మాత్రం మళ్ళీ బ‌న్నీ ట్రాక్‌లో ప‌డిన‌ట్లే. ఇక‌పోతే హిట్‌కొట్టినా ఫ్లాప్ కొట్టినా స‌రే బ‌న్నీ ఇక పై అంత గ్యాప్ తీసుకోవ‌డం కూడా మంచిది కాదు. ఎందుకంటే ఆయ‌న నుంచి ఇంతింత గ్యాప్ వ‌స్తే ఫ్యాన్ష్ కాస్త అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్నారు. ఇక ఈ చిత్రానికి త‌మ‌న్ మ్యూజిక్ అందించారు. సీనియ‌ర్ హీరోయిన్ ట‌బు ఈ చిత్రంలో కీల‌క పాత్ర‌ను పోషించారు. ప్ర‌తి ఒక్క పాత్ర‌కి ఈ చిత్రంలో చాలా ప్రాముఖ్య‌త ఉంటుంద‌ని ఇటీవ‌లె త్రివిక‌మ్ తెలిపారు. చివ‌రికి అల‌వైంకుఠ‌పురం హిట్ కొట్టుదా లేక ఏమ‌వుతుంద‌ని మ‌రి కొద్ది గంట‌ల్లో తేలిపోతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: