స్టైలిష్ స్టార్ గా అభిమానుల హృదయాల్లో చెక్కుచెదరని స్థానం పొందిన అల్లు అర్జున్ హీరోగా నటించిన లేటెస్ట్ ఫిల్మ్ 'అల.. వైకుంఠపురములో'. మాటల మాంత్రికుడిగా పేరు తెచ్చుకొని, టాలీవుడ్ లోని  అగ్ర దర్శకుల్లో ఒకరిగా ఎదిగిన త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాని  హారిక అండ్ హాసిని క్రియేషన్స్ ,గీతా ఆర్ట్స్  పతాకాలపై అల్లు అరవింద్, ఎస్. రాధాకృష్ణ సంయుక్తంగా నిర్మించారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ సినిమా విడుదలవుతున్న సందర్భంగా అల్లు అర్జున్  మీడియాతో  జరిపిన సంభాషణ విశేషాలు.

 

ఇక త్రివిక్ర‌మ్ సినిమాల‌కు ఒక ప్ర‌త్యేక‌మైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంట‌ద‌న్న విష‌యం తెలిసిందే. అయితే ఈ మ‌ధ్య వ‌చ్చే చిత్రాలు మాత్రం కాస్త మిక్స్‌డ్ టాక్ వ‌స్తున్నాయి. కొంద‌రు బావుంది అంటుంటే మ‌రి కొంత‌మంది అస్స‌లు బాలేద‌ని తేల్చి చెప్పేస్తున్నారు. ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ లాంటి పెద్ద హీరో న‌టించిన చిత్ర‌మైన క‌థ బావుండ‌క‌పోతే ప్రేక్ష‌కులు ఆద‌రించ‌డం లేదు. అదే కోవ‌లోకి వెళ్ళింది `అజ్ఞాత‌వాసి` చిత్రం. ఆ చిత్రం అట్ట‌ర్ ఫ్లాప్ అవ్వ‌డంతో అప్ప‌ట్లో చాలా మంది ఫ్యాన్స్ త్రివిక్ర‌మ్‌ను తిట్టుకున్నారు. అజ్ఞాత‌వాసి దెబ్బ త్రివిక్ర‌మ్‌కు మాములుగా త‌గ‌ల్లేదు. అల‌సే ఫ్లాప్ టాక్ తెచ్చుకున్న ఆ చిత్రం వ‌ల్ల ఇటు త్రివిక్ర‌మ్‌కే కాకుండా ప‌నిగ‌ట్టుకుని ప‌వ‌న్ ప‌రువు కూడా తీసిన‌ట్టు అయింది ఆ చిత్రం. 

 

ఇక ఈ చిత్రం విష‌యానికి వ‌స్తే... అస‌లే చాలా గ్యాప్ త‌ర్వాత వ‌స్తున్న బ‌న్నీని గ‌ట్టెక్కిస్తాడా లేదా నిండా ముంచేస్తాడా అని ఫ్యాన్స్ భ‌య‌ప‌డుతున్నారు. కాక‌పోతే ఇప్ప‌టివ‌ర‌కు విడుద‌లైన టీజ‌ర్‌, సాంగ్స్ మాత్రం సోష‌ల్ మీడియాలో ఓ హైప్ క్రియేట్ అయి మంచి హిట్ కొట్టాయి. ఆడియో మాత్రం స‌రిలేరు చిత్రం క‌న్నా బంప‌ర్ హిట్ అని చెప్పాలి. మ‌రి ఇక తెర‌మీద ఆ పాట‌ల‌ను ఎంత బాగా త్రివిక్ర‌మ్ చిత్రాక‌రించార‌న్న‌ది సినిమా చూస్తేగాని అర్ధం కాదు. అల హిట్ అయితే మాత్రం త్రివిక్ర‌మ్ అజ్ఞాత‌వాసి ఫ్లాప్ నుంచి కాస్త బ‌య‌ట‌కి వ‌స్తారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: