సూపర్‌స్టార్ మహేష్ బాబు నటించిన తాజా చిత్రం సరిలేరు నీకెవ్వరు తెరకెక్కిన చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహించగా జనవరి 11న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ సినిమాపై ఎన్నో అంచనాలు పెట్టుకొని ఎప్పటినుంచో వేయి కళ్లతో ఎదురుచూస్తోన్న ఫ్యాన్స్.. ప్రీమియర్ షోలకు వెళ్లి సోషల్ మీడియాలో బొమ్మ అదిరిపోయిందంటూ కామెంట్లు పెడుతున్నారు. మహేష్ బాబు, ప్రకాష్ రాజ్, విజయశాంతి ఎపిసోడ్‌లు అరాచకమని.. కామెడీ అద్భుతంగా ఉందని, దేవీ శ్రీ ప్రసాద్ బ్యాక్‌ గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయిందని వారు కామెంట్లు పెడుతున్నారు. 


మొత్తానికి మహేష్ బాబు కెరీర్‌ లో నెవ్వెర్ బిఫోర్.. ఎవ్వర్ ఆఫ్టర్ సినిమా అంటూ ఫ్యాన్స్ సంతోషపడుతున్నారు. అంతేకాదు ఈ సినిమాలో మహేష్ బాబు డ్యాన్స్‌ కు థియేటర్లో పూనకాలని, ట్రైన్ కామెడీ అయితే అదరగొట్టిదంటూ తమ రివ్యూలను ఇస్తున్నారు. మొత్తానికి మహేష్‌కు అనిల్ అదిరిపోయే హిట్ ఇచ్చాడని అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు ఫాన్స్. 


నా కెరియర్‌ లో నేను తీసుకున్న వన్ ఆఫ్ ది బెస్ట్ డిసిషన్ ఈ టైంలో ఈ సినిమా చేయడం అని సినిమా విడుదలకు ముందు స్టేట్ మెంట్ ఇచ్చిన మహేష్ బాబు.. ఈ చిత్రం ద్వారా తనలోని కొత్త నటుడ్ని చూపించారు. నా నుండి మంచి మాస్ సినిమా రావడంలేదనే కంప్లైంట్ ఫ్యాన్స్ నుండి ఉంది. ఈ సినిమాతో అది తీర్చేస్తా అని చెప్పిన మహేష్ ఈ సినిమాతో మాస్ అండ్ క్లాస్‌ మిక్స్ చేసి వారి కలను నెరవేర్చారు.


దేవి శ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన పాటలు వినడానికంటే చూడ్డానికి చాలా బాగున్నాయి. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. మైండ్ బ్లాక్ , డాంగ్ డాంగ్ సాంగ్ విజువల్‌గా అదిరిపోయింది. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ‌తో పాటు సినిమాటోగ్రాఫర్ రత్నవేలు పనితనం అద్భుతం అనే చెప్పాలి.  ఈ సంక్రాంతికి మీరు వెళ్లి బాగా ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్....

మరింత సమాచారం తెలుసుకోండి: