సంక్రాంతి సీజన్ లో వచ్చిన 'అల వైకుంఠపురములో'ఒకటి. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ - త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో తెరకెక్కిన హ్యాట్రిక్ సినిమా కావడంతో ఈ సినిమాపై ప్రారంభం నుంచి ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ప్రచారంలో కొత్త పుంతలు తొక్కుతూ మూడు నెలల ముందు నుంచి ప్రేక్షకులను ఆకట్టుకునేలా పబ్లిసిటి చెయ్యడంతో సినిమాకు భారీగా హైప్ పెరిగింది. ముఖ్యంగా 'అల వైకుంఠపురములో' పాటలు సోషల్ మీడియాను షేక్ చేశాయి. ఒక సినిమాపై హైప్ ఆకాశాన్ని తాకుతోంది అంటే ఆ ఇంపాక్ట్ రెండవ సినిమాపై పడుతుంది. సినిమాలో కంటెంట్ బాగుండి.. ప్రేక్షకులకు కనెక్ట్ అయితే సినిమా రేంజ్ ఎక్కడికో వెళ్తుంది. బాక్సాఫీస్ లెక్కలను తిరగరాస్తుంది. పొరపాటున కానీ సినిమా అంచనాలు అందుకోలేకపోతే బాక్స్ ఆఫీస్ వద్ద దారుణంగా చతికిల పడే అవకాశాలు ఉంటాయి. దీనికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. త్రివిక్రమ్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన 'అజ్ఞాతవాసి' నే ఒక ఉదాహరణగా చెప్పొచ్చు. 

 

'అల వైకుంఠపురములో' సినిమాకు పాటలు సూపర్ హిట్ అయ్యాయి. కానీ టీజర్ కు మాత్రం మిగతా సినిమాల మాదిరిగా పరవాలేదు అన్న స్పందనే వచ్చింది. బన్నీ స్టైలిష్ గా కనిపించడం తప్ప కొత్తగా ఏమీ లేదని కూడా కొందరు బాగానే కామెంట్ చేస్తున్నారు. ఒకరకంగా చెప్పాలంటే సన్నాఫ్ సత్యమూర్తి కనిపిస్తోందని కూడా ట్రోల్ చేస్తున్నారు. ఇక ఈ మధ్య త్రివిక్రమ్ ట్రాక్ రికార్డు కూడా ఏమంత గొప్పగా లేదు. ఇది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అసలు గతంలో ఉన్న మ్యాజిక్ ఇప్పుడు గురువు గారు చేయలేకపోతున్నాడని చెప్పుకుంటున్నారు. 'అజ్ఞాతవాసి' త్రివిక్రమ్ ఇమేజ్ ను బాగా దెబ్బ తీసిన సంగతి తెలిసిందే. 

 

అయితే అదే మళ్ళీ రిపీటయిందన్నట్టుగా టాక్ వస్తోంది. ఈ సినిమా యూ.ఎస్ రివ్యూ వచ్చేసింది. ఎప్పటిలాగే సినిమాలో కథ కొరవడిందని చెప్పుకుంటున్నారు. అసలు త్రివిక్రమ్ ఈ ఫార్మాట్ ని ఇక వదలారా అంటూ సెటైర్లు పడుతున్నాయి. సినిమా మొత్తంలో ఎప్పటిలాగే ఆకాడక్కడా ఆయన మార్క్ డైలాగులు తప్ప ఇంకేమి లేదని సినిమా చూసిన జనాలు చెప్పుకుంటున్నారు. సినిమాలో ఏదైనా ప్లస్ ఉందంటే అది బన్నీ నే నట. ఆయన తప్ప సినిమాలో ఇంకేం లేదని ఆ తర్వాత ఆకట్టుకుంటుంది 'రాములో రాములా', 'బుట్ట బొమ్మ'.. అనే రెండు సాంగ్స్ అని అభిప్రాయపడుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: