అల్లు అర్జున్ కథనాయకుడిగా పూజా హెగ్డే కథనాయకగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా అల.. వైకుంఠపురములో. ఎన్నో అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా ఇప్పటికే ఫస్ట్ టాక్ వచ్చేసింది. అయితే అనుకున్నట్టుగానే సినిమా అంతా అద్భుతంగా లేదట.. అడపాదడపా సీన్లతో సినిమా అలా అలా సాగిపోయింది అని అంటున్నారు సినీ ప్రేమికులు. 

 

సినిమా ఉహించినంత లేదు అని.. త్రివిక్రమ్ అన్ని సినిమాలలో అక్కడక్కడా సీన్లు తీసుకొని అలా కొనసాగించారని అంటున్నారు నెటిజన్లు. జులాయి నుండి మిడిల్ క్లాస్ అబ్బాయి సిన్.. సన్ ఆఫ్ సత్యమూర్తి నుండి మనుషులకు విలువ ఇచ్చే సిన్, ఇంకా అల్లు అర్జున్ చెప్పినట్టు సినిమాలో ముఖ్య పాత్ర అయిన తండ్రి పాత్ర జులయిలో తండ్రి పాత్ర లనే ఉంది అని అంటున్నారు సినీ ప్రేమికులు. 

 

అంతేకాదట.. అత్తారింటికి దారేది.. అ ఆ, అరవింద సమేత సీన్లు కూడా బాగా వాడేసాడట త్రివిక్రమ్ శ్రీనివాస్. ఈ సినిమా చూసిన అభిమానులు నిన్న రిలీజ్ అయిన మహేష్ బాబు సినిమా సరిలేరు నికెవ్వరూ చూసిన ప్రేక్షకులు సంచలన వ్యాఖ్యలు చేశారు. అదేంటంటే.. మహేష్ బాబు సరిలేరు నికెవ్వరూ సినిమా అంతా కూడా లేదట అల వైకుంటాపురములో.. సరిలేరు నికెవ్వరూ సినిమానే ఈ సినిమా కంటే బాగుందట. 

 

అంతేకాదు.. ఈ సినిమాకు సంగీతం దగ్గర మంచి మార్కులు పడ్డాయట. థమన్ ఈ సినిమాకు సంగీతం ఎంతో అద్భుతంగా ఇచ్చారని.. సరిలేరు లో అదే దెబ్బ పడింది అని అంటున్నారు ప్రేక్షకులు. ఈ సినిమాలో సమజావారగమ పాట అద్భుతంగా ఉంది. ఇంకా సినిమాలో కామెడీ సీన్లు అడపాదడపా గా ఉన్నాయట.  ఫైట్లు మాత్రం బాగున్నాయట.. కథ కాస్త వీక్ గానే ఉందని అంటున్నారు... మరి ఇంత నెగటివ్ టాక్ తెచ్చుకున్న బన్నీ సినిమా ఏ మాత్రం వసూళ్లు చేస్తుందో చూడాలి. 

 

 

 

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: