మాటల మాంత్రీకుడు త్రివిక్రమ్ సినిమా అంటే ప్రేక్షకులు పరిగెత్తుకుంటూ థియోటర్స్ కి పరుగులు పెడతారు. అందుకు కారణం ఆయన సినిమాలో అన్నీ ఉంటాయి. మంచి కథ, అద్భుతమైన కథనం, హీరోయిజం, హీరోయిన్ గ్లామర్, అదిరిపోయో పంచ్ డైలాగులు, ఫ్యామిలీ ఎమోషన్స్ ఇలా అన్నీ వర్గాల ప్రేక్షకులకు కావలసిన అంశాలు పుష్కలంగా ఉంటాయి. అయితే అవన్నీ కొంతకాలంగా మరీ రొటీన్ అవుతున్నాయి. అందుకే రాను రాను ఆయన సినిమాలలో అన్నీ డ్రై అయిపోతూ కేవలం పంచ్ డైలాగులే మిగులుతున్నాయి. తెరనిండా నటీ నటులున్నప్పటికి వాళ్ళు కేవలం మేకప్ వేసుకొని సందర్భానుసారం రియాక్ట్ అవుతూ నవ్వడమో, ఏడవడమో కన్‌ఫ్యూజన్ గా చూడడమో చేస్తుంటారు తప్ప క్యారెక్టర్ లో లీనమవడానికి ఏమీ ఉండదు. 

 

ఇప్పుడు తాజాగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ త్రివిక్రం శ్రీనివాస్ కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమా 'అల వైకుంఠపురములో'. ఇప్పటికే ఆడియో పరంగా సూపర్ హిట్ అయింది. ఇప్పటి వరకు థమన్ ఇవ్వని విధంగా ఈ సినిమాకి సంగీతమందించాడు. ముఖ్యంగా 'సామజవరగమన', 'రాములో రాములా' సాంగ్స్ సినిమాకి బోలెడంత క్రేజ్ ని తీసుకువచ్చాయి. అంతేకాదు బుట్ట బొమ్మ అనే సాంగ్ కూడా సినిమా మీద బాగా హైప్ తీసుకు వచ్చింది. ఈ హైప్, క్రేజ్ తో 'అల' అద్భుతమైన సక్సస్ ని అందుకుంటుందని అందరూ అనుకున్నారు. బన్నీ కి పక్కా బ్లాకా బ్లాక్ బస్టర్ హిట్ పడుతుందని అన్నారు. కానీ ఇప్పుడు యూ.ఎస్ లో పడ్డ ప్రీమియర్స్ టాక్ చూస్తుంటే అంత లేదనే టాక్ బయటకు వచ్చింది. ఎంతో నమ్మకంతో వెళ్ళిన జనాలకి త్రివిక్రం మార్క్ రొటీన్ పంచ్ డైలాగులు, కామెడీ సీన్స్ తప్ప మిగతా సినిమాకి లాజిక్ లేదని ముఖ్యంగా క్లైమాక్స్ అసలు అలా ఎందుకు క్లారిటి ఇవ్వకుండా వదిలేశారో అంటున్నారు.

 

టబు వంటి సీనియర్ నటి ఉన్నప్పటికి ఆమె పాత్రలో ఏమీ లేదని పెదవి విరిచారట. పూజా హెగ్డే కేవలం పాటల కోసమే ఉందని అది తప్ప సినిమాలో చేసిందేమీ లేదని చెపుకుంటున్నారట. ఇక సుశాంత్ అసలు ఎందుకున్నాడో ఏం చేశాడో కూడా తెలీడం లేదట. ఏదో ఒక్క సీన్ లోనో రెండు సీన్స్ లోనో నాలుగు మాటలు మాట్లాడాడట. ముందు నుంచి సెకండ్ హీరోయిన్ గా చెప్పుకొచ్చిన నివేదా పేతురాజ్ అయితే సరే సరి అంటున్నారు. మొత్తానికి బన్నీ ఒక్కడే సినిమాని తన భుజాల మీద వేసుకున్నాడని ఆయన వన్ మ్యాన్ షో నే సినిమాని నిలబెట్టాలని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారట. హ్యాట్రిక్ సినిమా అని వెళితే ప్రేక్షకులను బాగా డిసప్పాయింట్ చేస్తుందని టాక్ వస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: