స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్-పూజా హెగ్డే జంటగా తెరకెక్కిన సినిమా 'అల వైకుంఠపురములో'. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో లో తెరకెక్కిన ఈ హ్యాట్రిక్ సినిమాపై ముందునుంచి నుంచి ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా 'అల వైకుంఠపురములో' సినిమా బన్ని-త్రివిక్రమ్ లకు హ్యాట్రిక్ సినిమా. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి వచ్చి మంచి సక్సస్ ని అందుకున్నాయి. దాంతో మళ్ళీ వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా అనగానే ప్రేక్షకుల్లో విపరీతమైన ఆసకి నెలకొంది. దానికి తోడు 'అల' నుంచి థమన్ ఇచ్చిన పాటలు సోషల్ మీడియాను షేక్ చేశాయి. 

 

ఒక సినిమా మీద క్రేజ్ విపరీతంగా పెరుగుతుందంటే దానికి తగ్గట్టుగానే జనాల ఎక్స్‌పెక్టేషన్స్ కూడా భారీగా ఉంటాయి. కథ, కథనం గనక బావుందంటే ప్రేక్షకులు సినిమాని నెత్తిన పెట్టుకుంటారు. లేదంటే అది పవర్ స్టార్, మెగాస్టార్ సినిమా అయినా పక్కన పడేస్తారు. అందుకు ఉదాహరణ మెగాస్టార్ స్టాలిన్, త్రివిక్రమ్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన 'అజ్ఞాతవాసి' చెప్పొచ్చు. ఇక మన దగ్గర మరికొన్ని గంటల్లో థియోటర్స్ లోకి రాబోతోంది అల వైకుంఠపురములో. అయితే ఈ సినిమా ఓవర్సీస్ లో రిలీజైంది. ఎంతో ఊహించుకొని థియోటర్స్ కి వెళ్ళిన ప్రేక్షకులకు నిరాశే మిగిలిందట. ఎప్పటిలాగే మన మాటల మాంత్రీకుడి పంచ్ డైలాగులు బాగా పేలాయట. కొన్ని సీన్స్ బావున్నాయట. కానీ ఆహా అనుకునేంతగా లేవట. 

 

ఇప్పటికే ఇలాంటి సీన్స్ ని గురూజీ సినిమాలలో బోలెడన్ని సార్లు చూసేశాం అంటున్నారట. ఇక ఒక్క బన్నీ నే సినిమా మొత్తం మోశాడని ఆ తర్వాత సినిమాలో చెప్పుకోదగ్గ క్యారెక్టర్ అంటే జయరాం దే నట. మిగతా అందరు స్క్రీన్ నిండా ఉన్నారంటే ఉన్నారు అంతే అని సినిమా చూసిన జనాలు కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాకి పెద్ద మైనస్ అంటే క్లైమాక్స్ అని చాలామంది అభిప్రాయపడుతున్నారు. త్రివిక్రమ్ ఇలాంటి కన్విన్స్ కాని క్లైమాక్స్ తో ఏం చెప్పదలచుకున్నారో ముందే అందరికీ అర్థమై పోయిన సీక్రెట్ ని ఎందుకు రివీల్ చేయలేదో అర్థమవక కన్‌ఫ్యూజన్ తో బయటకు వస్తున్నారట. మరి మన దగ్గర రిలీజ్ అయితే గాని ఇంకా ఈ సినిమా మీద ప్రేక్షకుల అభిప్రాయమేంటో తెలుస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: