అరవింద సమేత వంటి యావరేజ్ హిట్ తర్వాత త్రివిక్రం శ్రీనివాస్ అలాగే నా పేరు సూర్య తర్వాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కలిసి 'అల వైకుంఠపురములో' సినిమాకి శ్రీకారం చుట్టారు. బాల్కానీలో బ్లాక్ కాఫీ తాగుతూ ఒకే ఒక్క మాటలో త్రివిక్రం కి 'ఎస్' చెప్పాడు బన్నీ. అందుకు కారణం మన మాటల మాంత్రీకుడంటే .. ఆయన రాసే కథలంటే అంత గురి. మరీ బ్లాక్ బస్టర్ కాకపోయినా హిట్ అన్న టాక్ వచ్చి కమర్షియల్ గా సేఫ్ జోన్ లో ఉంటుంది ఆయన సినిమా. బన్నీ కి ఇది రెండు సార్లు అనుభవంలోకి వచ్చింది. ఒకటి జులాయి, రెండు సన్నాఫ్ సత్యమూర్తి. ఈ రెండు ఇండస్ట్రీ తిరగరాసే సక్సస్ లు కాకపోయినా హీరోగా కమిటయిన బన్నీకి సక్సస్,  అలాగే డబ్బులు పెట్టిన నిర్మాత సేఫ్ గా ఉన్నారు. 

 

ఇక మరోసారి ఈ కాంబినేషన్ లో సినిమా తీసి సంక్రాంతికి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలనుకున్నారు. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే బన్నీ మొదటిసారి సంక్రాంతి బరిలో దిగాడు. అదీ సూపర్ స్టార్ మహేష్ బాబు సరిలేరు తో. అయితే గత 15-20 రోజులుగా ఎవరు ముందు రిలీజ్ చేయాలనే సందిగ్ధం లో ఉండి ఎట్టకేలకు తమ సినిమాల రిలీజ్ డేట్ లాక్ చేసుకున్నారు. మహేష్ 11 న బన్నీ 12 న వద్దామని ఫిక్సైయ్యారు. ఇక బన్నీ కంటే ఒక రోజు ముందు వచ్చిన మహేష్ సరిలేరు కొత డివైడ్ టాక్ కొంత యావరేజ్ టాక్ రావడంతో బన్నీ ఫుల్ ఖుషీ అయ్యాడు. ఇక సంక్రాంతి మాదే అని సంబరపడ్డాడు. రజనీకాంత్ దర్బార్ ని పక్కన పెడితే బన్నీ కి ఉన్న పెద్ద టార్గెట్ మహేషే. అయితే ఆ సినిమా కి టాక్ అంత గొప్పగా రాకపోవడంతో బన్నీ ఎనర్జీ డబుల్ అయింది.

 

కానీ ఆయన అనుకున్నట్టుగా 'అల' కి సూపర్ హిట్ టాక్ రాలేదు. పరవాలేదు,  యావరేజ్ అన్న టాక్ వచ్చింది. ఓవరీస్ లో రిలీజైన అల్లు అర్జున్ 'అల వైకుంఠపురములో' ప్రేక్షకులను కాస్త డిసప్పాయింట్ చేసిందని టాక్ వచ్చింది. ఈ సినిమా చూసిన మెగా ఫ్యాన్సే కాదు కామన్ ఆడియన్స్ కి 'అల' అంతగా ఆకట్టుకునే లా లేదని ఫీలయ్యారట. వాస్తవంగా అయితే సినిమా ఫస్టాఫ్ కే అయిపోయిందట. కానీ కథ లేకపోయినా సెకండాఫ్ లాగి లాగి సాగదీశారట. ఈ సంక్రాంతి విందు భోజనం లాంటి సినిమా అనుకుంటే అంతా వెలితేనని అంటున్నారు. మరి ఇంకొన్ని గంటల్లో తెలుగు రాష్ట్రాలలో విడుదల కాబోతున్న 'అల' కి ఎలాంటి టాక్ వస్తుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: