సంక్రాంతి సంద‌డిలో ఈరోజే విడుద‌లైన చిత్రం `అల‌వైకుంఠ‌పురంలో` ఈ చిత్రంలో అల్లుఅర్జున్‌, పూజాహెగ్డే హీరో హీరోయిన్లుగా న‌టించారు. ఈ చిత్రానికి త‌మ‌న్ మంచి మ్యూజిక్ అందించారు. ఇప్ప‌టికే విడుద‌లైన ట్రైల‌ర్, ఆడియోకి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ఇక త్రివిక్రమ్ దగ్గరికి వస్తే.. కథ కోసం ఎంచుకున్న పాయింట్ ని అండర్ కరెంట్ గా చెప్పడానికి ప్రయత్నించాడు, అందుకే చెప్పాలనుకున్న పాయింట్ పర్‌ఫెక్ట్ గా రీచ్ కాలేదు. కథగా డెవలప్ చేసినప్పుడు కూడా ఆయన పాత చిత్రాల‌నే రాసుకున్నారు. చాలా సీన్స్ ఆయన గత సినిమాలలోని సీన్స్ ని గుర్తు చేశాయి. అంటే ఈ సారి త‌న చిత్రాల నుంచే సీన్ల‌ను కాపీ కొట్టార‌న‌మాట‌. స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి, అత్తారింటికి దారేది, జులాయి సినిమాల్లోని సీన్లు తీసుకుని మిక్సీకొడితే అల‌వైకుంఠ‌పురంలో సినిమాలా ఉంది. ఈ సారి ప‌క్క సినిమాల జోలికి వెళ్ళ‌కుండా త్రివిక్ర‌మ్ త‌న సినిమాల నుంచే కొన్ని సీన్ల‌ను తీసుకుని ఎడ్జ‌స్ట్ అయిపోయార‌న‌మాట‌. మొత్తానికి క‌థ‌లు దొర‌క్క తివిక్ర‌మ్ ఇలా తీస్తున్నారా లేదా ఆయ‌న క‌థలే ఇంత అన్న‌ది చాలా మందికి అర్ధం కావ‌డం లేదు.

 

మొత్తానికి బ‌న్నీని ఈ సినిమాతో గ‌ట్టెక్కిస్తాడో ఏం చేస్తాడో మ‌రి ప్రేక్ష‌కుల నిర్ణ‌యం పై ఆధార‌ప‌డి ఉంది. సంక్రాంతికి విడుద‌లైంది కాబ‌ట్టి కాస్త బ‌న్నీ సేఫ్ అనే చెప్పాలి. ఎంత మిక్సీ కొట్టినా ఈ పండ‌గ‌నాడు పెద్ద హీరో సినిమా కాబ‌ట్టి చూసే ప్రేక్ష‌కులు చూస్తారు. మ‌రి బ‌న్నీ త్రివిక్ర‌మ్‌లు ఎంత వ‌ర‌కు స‌క్సెస్ అవుతారు అన్న‌ది తెలియాలి. అందులోనూ ఫ్యామిలీ ఎమోష‌న్స్‌కి కాస్త పెద్ద పీట వేస్తాడు కాబ‌ట్టి ప‌ర్వాలేద‌నుకుంట‌. కానీ ఈ స‌రిలేరు, అల రెండు చిత్రాలు మాములుగా చూసుకుంటే పెద్ద‌ కథాబ‌ల‌మైన చిత్రాలైతే కావు. ఇవే చిత్రాలు పండ‌గ‌కు కాకుండా మాములు రోజుల్లో విడుద‌ల‌య్యుంటే పెద్ద‌గా ఆద‌ర‌ణ పొందేవి కాదు. మ‌రి ఎప్ప‌టికీ కాపీ కొట్ట‌డ‌మేనా కొత్త‌గా క‌థ‌లు రాసుకునే ప‌నేమ‌న్నా ఉందో తెలియ‌డం లేదు. ఏదో ఒక చిన్న పాయింట్‌ని తీసుకుని దానికి మిగ‌తా సినిమాల సీన్ల‌న్నీ యాడ్ చేస్తూ సినిమా తీసేయ‌డ‌మ‌నేది ఎంత‌వ‌ర‌కు స‌బ‌బో అర్ధం చాలా మంది ప్రేక్ష‌కుల‌కు అర్దం కావ‌డంలేదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: