అల్లుఅర్జున్‌, పూజాహెగ్డే జంట‌గా న‌టించిన చిత్రం `అల‌వైకుంఠ‌పురంలో`త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈచిత్రం హారిక అండ్ హాసిని క్రియేషన్స్ ,గీతా ఆర్ట్స్  పతాకాలపై అల్లు అరవింద్, ఎస్. రాధాకృష్ణ సంయుక్తంగా నిర్మించారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ సినిమా విడుదల‌యింది. ఇక ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్ ఈసారి కూడా సినిమా తాలూకా ప్రధాన ప్రతిబింబాన్ని ఎప్పటిదో సినిమా నుంచి తీసుకున్నదే. దానిని నేటి తరానికి తగ్గటుగా తీర్చి దిద్దారు. ఇదే కాస్త నిరాశ కలిగించే అంశం ఒకవేళ అది తెలియ‌కుండా చిత్రం చూసిన వారికి మాత్రం నూటికి ఒక శాతం ఎక్కువే నచ్చుతుంది.

 

ఇక నటీనటుల విషయానికి వస్తే బన్నీ విష‌యానికి వ‌స్తే చాలా గ్యాప్ త‌ర్వాత చేసిన చిత్రం కాబ‌ట్టి ఆయ‌న‌కు హిట్ రావాల‌ని ఆయ‌న ఫ్యాన్స్ అంద‌రూ కోరుకుంటున్నారు. బ‌న్నీ డాన్స్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. పూజా ఒక్క గ్లామర్ తోనే కాకుండా మరోసారి మంచి పెర్ఫామెన్స్ ఇచ్చింద‌ని చెప్పాలి. గ‌తంలో వీరిద్ద‌రు క‌లిసి డిజె సినిమాలో న‌టించారు. ఆచిత్రం బాక్సాఫీస్ ముందు ప‌ర్వాలేద‌నిపించుకుంది. మొత్తానికి త్రివిక్ర‌మ్ పాత క‌థ‌నే కొత్త‌గా చూపించేశాడు. త్రివిక్ర‌మ్ సినిమాలు ఎక్కువ‌గా ఫాలోఅవ్వ‌ని ప్రేక్ష‌కుల‌కు ఇది ఒక‌ర‌కంగా మంచి మ‌జాగానే ఉంటుంది. ఏమాత్రం ఆ సినిమా సీన్లు గుర్తుకువ‌చ్చినా రొటీన్ రొడ్డ‌లానే అనిపిస్తుంది.

 

ఇంకెన్నాళ్ళు త్రివిక్ర‌మ్ ఇలా పాత చింత‌కాయ‌ప‌చ్చ‌ళ్ళ‌నే తినిపిస్తావ్‌. తినీ తినీ బోర్ కొట్టేస్తుంది అంటున్నారు కొంత మంది ఫ్యాన్స్‌. మొత్తానికి ఈ సంక్రాంతి నాలుగు పెద్ద చిత్రాలు బ‌రిలో నిల‌బ‌డ్డాయి. ఒక‌టి ద‌ర్బార్‌, స‌రిలేరు నీకెవ్వ‌రు, అల‌వైకుంఠ‌పురంలో, ఎంత‌మంచివాడ‌వురా ఇప్ప‌టికే విడుద‌లైన మూడు చిత్రాలు ఏది పెద్ద హిట్ లాగా కనిపించ‌డంలేదు. మూడు మ‌మా అనిపించుకున్నాయి. ఇక మిగిలింది క‌ళ్యాణ్‌రామ్ ఎంత‌మంచివాడ‌వురా చిత్రం మ‌రి ఎంతమంచివాడ‌నిపించుకుంటాడో చూడాలి మ‌రి. కళ్యాణ్‌రామ్ చిత్రంలో ఏమాత్రం కాస్త కొత్త క‌థ అని టాక్ బ‌య‌ట‌కు వ‌చ్చినా ఒకేసారి ఆ చిత్రం టాప్ రేంజ్‌కి రావ‌డం ఖాయం అని చెప్పాలి. అనిల్‌, త్రివిక్ర‌మ్‌ల రొటీన్ క‌థ‌ల‌ను చూసి బోర్ కొట్టిన‌వారు ఆ సినిమాని హిట్ చేస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి: