స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్‌గా తెర‌కెక్కిన చిత్రం ‘అల వైకుంఠపురంలో’. ఇటీవల అరవింద సమేత వంటి ఎమోషనల్, మాస్ మూవీని తీసిన త్రివిక్రమ్ ఈ చిత్రాన్ని అటు మాస్, ఇటు క్లాస్ ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా రూపొందించాడు. గతంలో బ‌న్నీ, త్రివిక్ర‌మ్‌ కాంబినేషన్లో జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి వచ్చి మంచి సక్సస్ ని అందుకున్నాయి. దాంతో మళ్ళీ వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా అనగానే ప్రేక్షకుల్లో విపరీతమైన ఆసకి నెలకొంది. సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 12(నేడు) ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్న ఈ చిత్రాన్ని  గీతా ఆర్ట్స్, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మింస్తున్నారు. 

 

ఇక ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన అన్ని పాటలు రికార్డులను తిరగరాస్తూ సెన్సేషన్స్ క్రియేట్ చేశాయి. ఇదిలా ఉంటే.. సినిమాపై భారీ అంచ‌నాలు ఉండ‌డంతో..  తెలుగు రాష్ట్రాల్లో స్పెషల్‌ షోలకు పర్మిషన్‌ రావటంతో ఆదివారం తెల్లవారుజాము నుంచే థియేట‌ర్ల‌లో బన్నీ సందడి మొదలైంది. ఇక ఓవర్‌సీన్‌లో మరో 12 గంటలు ముందుగానే ప్రీమియర్స్‌ షో పడుతున్నాయి. సినిమా విష‌యానికి వ‌స్తే.. ఫ‌స్టాఫ్‌లో బాస్ అయిన పూజాకు, ఆమె కింద ప‌నిచేసే బ‌న్నీ మ‌ధ్య వ‌చ్చే సీన్లు బాగున్నాయి. బ‌న్నీ ప్ర‌తిసారి మేడ‌మ్ మేడ‌మ్ అంటూ పూజాను విసిగిస్తూ ఉంటాడు. దీంతో పూజ ప్ర‌తిసారి మేడ‌మ్ మేడ‌మ్ అంటూ విసిగిస్తావు.. అంత‌కు మించి ఏం చేయ‌వు.. ఎందుకు ప‌నికిరావు అని క‌సురుకుంటుంది. 

 

కొన్ని జాత‌కాలే అంతే.. అన‌డంతో మేడ‌మ్ మా బామ్మ జాత‌కాల గురించి చెప్పింది.. విసిగిపోయాను మ‌ళ్లీ మీరు జాత‌కాల గురించి చెప్ప‌వ‌ద్ద‌ని అంటాడు. ఈ క్ర‌మంలోనే సామ‌జ‌వ‌ర‌గ‌మ‌న సాంగ్ వ‌స్తుంది. ఇక హీరోయిన్ అయినా పూజ హెగ్డే పాత్ర చెప్పుకోదగినది ఏం కాదు. కానీ ఫస్ట్ హాఫ్ లో తన లవ్ ట్రాక్ లో చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది. కాగా, ఈ చిత్రంలో టబు, రాజేంద్రప్రసాద్, సచిన్ ఖేడ్ కర్, తనికెళ్ళ భరణి, మురళీ శర్మ, సముద్ర ఖని, జయరాం, సునీల్, నవదీప్, సుశాంత్, నివేతా పేతురాజ్ ముఖ్య పాత్ర‌ల్లో న‌టించారు. సంక్రాంతి బ‌రిలో దిగిన ఈ చిత్రం ఎంత వ‌ర‌కు స‌క్సెస్ అవుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: