స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ కలిసి మూడో సారి చేస్తున్న సినిమా `అల వైకుంఠపురములో`. పూజా హెగ్డే హీరోయిన్‌గా న‌టించిన్న‌ ఈ చిత్రాన్ని శ్రీమతి మమత సమర్పణలో హారిక అండ్ హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ బ్యానర్లపై అల్లు అరవింద్, కె. రాధాకృష్ణ నిర్మించారు.  సంక్రాంతి బరిలోకి దిగేందుకు జనవరి 12 థియేటర్లలోకి రాబోతోంది అల వైకుంఠపుములో.  ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పాటలు, టీజర్‌కి ట్రెమెండస్ రెస్పాన్స్ రావడంతో సినిమా పై భారీ అంచనాలు ఏర్ప‌డ్డాయి. 

 

సినిమా కోసం  బన్నీ అభిమానులతో పాటు సగటు ప్రేక్షకులంతా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. దీంతో తెలుగు రాష్ట్రాల్లో స్పెషల్‌ షోలకు పర్మిషన్‌ రావటంతో ఆదివారం తెల్లవారుజాము నుంచే బన్నీ సందడి మొద‌లైంది. ఇక ఓవర్‌సీన్‌లో మరో 12 గంటలు ముందుగానే ప్రీమియర్స్ షోలు పడ్డాయి. ఇక సినిమా విష‌యానికి వ‌స్తే.. ఇంట‌ర్వెల్ బ్యాంగ్‌కు ముందు బ‌న్నీకి తాను రామ‌చంద్ర కొడుకును అని తెలుస్తుంది. అయినా ఆ రామ‌చంద్ర‌, ట‌బు త‌న త‌ల్లిదండ్రులు అని తెలిసినా ఆ ఇంటికి వెళ్ల‌కుండా ముర‌ళీశ‌ర్మ ద‌గ్గ‌రే ఉంటాడు. ఇక్క‌డే ఉండి మీ కొడుకు అక్క‌డ ఉన్నాడు.. మా బాబు అక్క‌డ ఉన్నాడు అని సెటైర్లు వేస్తూ పంచ్‌లు పేలుస్తూ ఉంటాడు.  

 

త‌న కొడుకు కోటీశ్వ‌రుడు అవ్వాల‌ని చిన్న‌ప్పుడు ముర‌ళీశ‌ర్మ పిల్ల‌ల‌ను మార్చేస్తాడు. చిన్న‌ప్ప‌టి నుంచి అబ‌ద్ధాలు ఆడే ముర‌ళీశ‌ర్మ‌కు బ‌న్నీకి మ‌ధ్య వ‌చ్చే సీన్లు న‌వ్విస్తాయి. త‌న కొడుకు కాని కొడుకుతో ముర‌ళీశ‌ర్మ‌, తండ్రి కాని తండ్రితో బ‌న్నీ వేసే డైలాగులు సినిమాకు బాగా హైలెట్ అవుతాయి. కాగా, అల్లు అర్జున్ వన్ మాన్ ఆర్మీలా సినిమా మొదటి నుంచి చివరి దాకా తన పెర్ఫార్మన్స్ తో ఆకట్టుకుంటూ వచ్చాడు. అల్లు అర్జున్ మరోసారి కామెడీ టైమింగ్ తో మెప్పించాడు. ఏదేమైనా కథ పరంగా గొప్పగా లేకపోయినా,  త్రివిక్రమ్ కామెడీ, డైలాగ్స్ మరియు ఎమోషన్స్ తో అల్లు అర్జున్ తో మేజిక్ క్రియేట్ చేశాయ‌ని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: