స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రం కాంబినేషన్ లో వస్తున్న సినిమా అల వైకుంఠపురములో. బన్ని సరసన పూజా హెగ్దె హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు థమన్ మ్యూజిక్ అందించాడు. ఈరోజు ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమాలో తెర ముందు హీరో అల్లు అర్జున్ అయినా తెరవెనక మాత్రం ఇద్దరు హీరోలని చెప్పొచ్చు. త్రివిక్రం తన రెగ్యులర్ సినిమాల మాదిరిగానే ఈ సినిమా చేశాడు. పంచులు, ఎమోషనల్ సీన్స్ బాగున్నాయి. 

 

అయితే ఈ సినిమాలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన ఇద్దరు ఎవరంటే ఒకరు సినిమాటోగ్రాఫర్ పి.ఎస్ వినోద్. మరొకరు మ్యూజిక్ డైరక్టర్ ఎస్.థమన్. రిలీజ్ ముందే థమన్ మ్యూజిక్ ఏ రేంజ్ లో హిట్టయిందో అందరికి తెలుసు. ఇక సినిమాలో కెమెరా మెన్ వినోద్ తన టాలెంట్ చూపించాడు. సినిమా చాలా అందంగా తీర్చిదిద్దడంలో పి.ఎస్ వినోద్ కృషి చాలా ఉంది. అల వైకుంఠపురములో ఫస్ట్ టాక్ చూస్తే సినిమా అంచనాలకు తగినట్టుగానే ఉందని అనిపిస్తుంది.

 

ఇక ఈ సినిమాలో అల్లు అర్జున్ చాలా కొత్తగా కనిపిస్తాడట. బన్ని తన కెరియర్ లో ఇప్పటివరకు ఇంత వెయిట్ ఉన్న ఎమోషనల్ రోల్ చేయలేదని అంటున్నారు. ఇక పూజా హెగ్దె అందాలు కూడా సినిమాకు ప్లస్ అని అంటున్నారు. థమన్ మ్యూజిక్, త్రివిక్రం పెన్ పవర్ సినిమాను మరో లెవల్ కు తీసుకెళ్లాయని తెలుస్తుంది. ప్రీమియర్స్ నుండి సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకోగా సినిమా అసలు టాక్ ఏంటన్నది తెలుగు రెండు రాష్ట్రాల్లో బొమ్మ పడితేనే తెలుస్తుంది. సినిమాపై బన్ని చాలా హోప్స్ పెట్టుకున్నాడు. ఈ సినిమాకు పోటీగా నిన్న రిలీజైన సరిలేరు నీకెవ్వరు సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. రాబోతున్న ఎంత మంచివాడవురా కూడా ఎలా ఉంటుందో చూడాలి. అది కూడా హిట్ అనే టాక్ వినిపిస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: