ఏ ఫ్యామిలీ నుంచి వ‌చ్చిన హీరో ఆ ఫ్యామిలీ హీరోల గురించి చెప్పుకోవ‌డం అనేది స‌ర్వ సాధార‌ణం అందులోనూ మ‌న టాలీవుడ్‌లో ఆ ఆచారం మ‌రి కాస్త ఎక్కువ‌నే చెప్పాలి. సంక్రాంతి బ‌రిలో విడుద‌లైన అల్లుఅర్జున్ న‌టించిన తాజా చిత్రం `అల‌వైకుంఠ‌పురంలో` ఈ చిత్రం ఓ సీన్‌లో  నివేద పేతురాజ్ తో బ‌న్నీ మాట్లాడేట‌ప్పుడు ఆమె బ‌న్నీని గుర్తు ప‌ట్ట‌దు. నాకు మీరెవ‌రో గుర్తులేరండి అంటుంది. నాది బ్యాడ్ మెమ‌రీ సారీ అంటుంది. అప్పుడు ప‌ర్లేదు మెగాస్టార్ ఇలా అని చేయి ఊపుతాడు. అలా ఆయ‌న‌కు మ‌నం అభిమానులం అయినా మ‌న‌మంద‌రం గుర్తుంటామా అని అంటాడు. అలా నేను ఇలా అని ఈ సీన్లో మెగాస్టార్‌ను బ‌న్నీ వాడేశాడు.

 

 మ‌రి మామ‌య్య‌ను వాడ‌కుండా బ‌న్నీ సినిమా ఎలా చూపిస్తాడు ఇట్స్ హైలీ ఇమ్‌పాజిబుల్ క‌దా. సినిమాలో ఎక్క‌డో ఒక అంశంలోనైనా మామ‌య్య‌ని ఖ‌చ్చితంగా చూపిస్తాడు. ఆయ‌న మీద ఉన్న అభిమానాన్ని చాటి చెప్పుకోవాల‌ని త‌న మొద‌టి సినిమా నుంచి చూస్తూనే ఉంటాడు. త‌న మొద‌టి సినిమా అప్పుడు  కూడా బ‌న్నీ ఒక పాట‌లో చిరంజీవి ఊరుపేరు తీసుకువ‌స్తాడు. ఇలా త‌న ప్ర‌తి సినిమాలోనూ చిరంజీవి పై త‌న అభిమానాన్ని తెలుపుతూనే ఉంటాడు.

 

అది కొంత వ‌ర‌కు వాళ్ల‌కు ప్ల‌స్ అవుతుంద‌నుకుంటారో ఏమో మ‌రి. ఇక స్టైలిష్ స్టార్ గా అభిమానుల హృదయాల్లో చెక్కుచెదరని స్థానం పొందిన అల్లు అర్జున్ హీరోగా నటించిన లేటెస్ట్ ఫిల్మ్ 'అల.. వైకుంఠపురములో'. మాటల మాంత్రికుడిగా పేరు తెచ్చుకొని, టాలీవుడ్ లోని  అగ్ర దర్శకుల్లో ఒకరిగా ఎదిగిన త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాని  హారిక అండ్ హాసిని క్రియేషన్స్ ,గీతా ఆర్ట్స్  పతాకాలపై అల్లు అరవింద్, ఎస్. రాధాకృష్ణ సంయుక్తంగా నిర్మించారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ సినిమా విడుదలయింది. మ‌రి ఈ చిత్రం హిట్టా ఫ‌ట్టా అన్న‌ది ఇంకా తెలియాల్సి ఉంది. ఒక ర‌కంగా ఈ చిత్రంలోని సెంటిమెంట్ ఫ్యామిలీ ఆడియ‌న్స్‌ని ఆక‌ట్టుకునేలా ఉంద‌ని ఫ్యాన్స్ అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: